Share News

నాణ్యమైన ఆహారం అందించడమే ధ్యేయం

ABN , Publish Date - Mar 18 , 2026 | 12:22 AM

విద్యార్థులకు నాణ్యమైన విద్య తో పాటు పౌష్ఠికాహారం అందించమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు.

నాణ్యమైన ఆహారం అందించడమే ధ్యేయం
విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న ఎమ్మెల్యే గొండు శంకర్‌

శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌

అరసవల్లి, మార్చి 17(ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు నాణ్యమైన విద్య తో పాటు పౌష్ఠికాహారం అందించమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. మంగళవారం నగరంలోని హడ్కో కాలనీలోని మునిసిపల్‌ హైస్కూల్‌ను సందర్శించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. మెనూ ప్రకారం ఆహారం అందుతున్నదీ లేనిదీ ఆరా తీశారు. వంటశాలను, చేతులు శుభ్రపరచుకునే స్థలం, టాయిలెట్లను పరిశీలించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

‘జాబ్‌ మేళాను వినియోగించుకోండి’

అరసవల్లి, మార్చి 17(ఆంధ్రజ్యోతి): జాబ్‌మేళాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గొండు శంకర్‌ కోరారు. బలగ డీఎల్‌టీసీ ఐటీఐలో మంగళవారం మెగా జాబ్‌ మేళా నిర్వహించారు. కార్యక్రమం లో టీడీపీ నగర అధ్యక్షుడు పాండ్రంకి శంకర్‌, నేతలు పీఎంజే బాబు, ప్రధాన విజయరాం, రెడ్డి గిరిజాశంకర్‌, డి.జ్యోతి భాస్కర్‌ పాల్గొన్నారు.

‘రైతు సమస్యల పరిష్కారానికి కృషి’

శ్రీకాకుళం రూరల్‌, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. శ్రీకాకుళం రూరల్‌ మండలం బైరివానిపేటలో మంగళవారం రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో బీఆర్‌ఆర్‌ వంశధార ప్రాజెక్టు చైర్మన్‌ అరవల రవీంద్ర, రూరల్‌ మండల టీడీపీ అధ్యక్షుడు మూకళ్ళ శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి కంచు దశరథ, బైరి వానిపేట సర్పంచ్‌ బైరి నరేష్‌, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 18 , 2026 | 12:22 AM