నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం
ABN , Publish Date - Sep 29 , 2026 | 11:47 PM
గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేసి ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మంగళవారం వాండ్రాడ గ్రామ పంచాయతీ నర్సింగపల్లిలో రూ.3.92 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న విద్యుత్ సబ్ స్టేషన్‌కు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సౌర విద్యుత్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సోలార్ వల్ల విద్యుత్ బిల్లు ఆదా అవుతుందని వివరించారు. నిమ్మాడలోని తన నివాసం, కార్యాలయంపై సోలార్ ఏర్పాటు చేసుకోవడం వల్ల కరెంటు బిల్లు నెలకు రూ.60వేల నుంచి రూ.1200కు తగ్గిందని వివరించారు.
కోటబొమ్మాళి, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేసి ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మంగళవారం వాండ్రాడ గ్రామ పంచాయతీ నర్సింగపల్లిలో రూ.3.92 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న విద్యుత్ సబ్ స్టేషన్‌కు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సౌర విద్యుత్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సోలార్ వల్ల విద్యుత్ బిల్లు ఆదా అవుతుందని వివరించారు. నిమ్మాడలోని తన నివాసం, కార్యాలయంపై సోలార్ ఏర్పాటు చేసుకోవడం వల్ల కరెంటు బిల్లు నెలకు రూ.60వేల నుంచి రూ.1200కు తగ్గిందని వివరించారు.
నిమ్మాడలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్
స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా నిమ్మాడలోని పాత పీహెచ్‌సీ భవనంలో మరో వారం పది రోజుల్లో స్కిల్ డెవల ప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించన ున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడిం చారు. స్థానిక పరిశ్రమల అవస రాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి.. ఉద్యోగాలు కల్పిం చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. శిక్షణ అనంతరం రూ.20వేల నుంచి రూ. 40వేల వేతనంతో ఉద్యోగ అవ కాశాలు కల్పించేలా పరిశ్రమలతో సమ న్వయం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ చైర్మన్ కింజరాపు హరిప్రసాద్, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ జి.ఎస్. ప్రసాద్, నరసింహకుమార్, ఆనంద్, జీవీ ప్రసాద్, కోటేశ్వరరావు, జగదీష్, తహసీల్దార్ ప్రసాద్, నేతలు బోయిన గోవిందరాజులు, వెలమల విజయలక్ష్మి, తర్ర రామకృష్ణ పాల్గొన్నారు.