నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం
ABN , Publish Date - Apr 24 , 2026 | 12:41 AM
ప్రాథమిక స్థాయి నుంచి కళాశాల వరకు విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించటమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు.
పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు
ఎల్‌ఎన్ పేట, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): ప్రాథమిక స్థాయి నుంచి కళాశాల వరకు విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించటమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. మండలంలోని లక్ష్మినర్సుపేట కేజీబీవీలో రూ.2.49 కోట్లతో నిర్మించిన అదనపు గదులు, కంప్యూటరు, ఆర్ట్ అండ్ కం ప్యూటర్ గదులను గురువారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ సాంకేతికతతో కూడిన విద్యనందించటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబ, విద్యాశాఖమంత్రి లోకేశ్ సమగ్ర శిక్షకు నిధులను మంజూరు చేస్తున్నారన్నారు. సంబంధిత అధికారులు ఈ నిధులు సద్వినియోగం చేయాలన్నారు. కార్యక్ర మంలో జిల్లా సర్వశిక్ష అభియాన్ ఏపీసీ వేణుగోపాలరావు, ఎంపీడీవో పి.శ్రీని వాసరావు, ఎంఈవోలు సీహెచ్. మణికుమార్, కె.చంద్రమౌళి, కేజీబీవీ ప్రత్యేకా ధికారి ఎంవీ అంబిక, మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.మోహనరావు, ఏఎంసీ వైస్‌చైర్మన్ కె.కృష్ణమాచారి, ఎంపీటీసీ ఎస్.మోహనరావు పాల్గొన్నారు.