Share News

సంపూర్ణ హక్కులు కల్పించడమే లక్ష్యం

ABN , Publish Date - Feb 05 , 2026 | 11:49 PM

రైతులకు సంపూర్ణ భూహక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు.

 సంపూర్ణ హక్కులు కల్పించడమే లక్ష్యం
రైతులకు పాసు పుస్తకాలు అందిస్తున్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు:

పాతపట్నం, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): రైతులకు సంపూర్ణ భూహక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. బూరగాం గ్రామంలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో తమ సొంత ఫొటోలను వేసుకొని రైతుల భూములపై తమ పెత్తనం చెలాయించేలా వైసీపీ నేతలు నిరంకుశంగా వ్యవహరించారని ఆరోపించారు. దీనికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్వస్తి పలికారని తెలిపారు. మహేంద్రతనయ నదిపై వంతెన నిర్మాణానికి హామీ ఇచ్చారు. గ్రామంలోగల జడ్డెమ్మతల్లి ఆలయానికి ప్రహరీ నిర్మా ణానికి, చంద్రశేఖరుని ఆలయ అభివృద్ధికి టీటీడీ నుంచి వారం రోజులలో నిధులు మంజూరు చేయిస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్‌ అధ్యక్షుడు బండి రవివర్మ, ప్రహ్లాద్‌ పొల్లాయ్‌, మడ్డు రామారావు, సైలాడ సతీష్‌, తహశీల్దార్‌ నందిగామ ప్రసాదరావు, ఎంపీడీవో రమణమూర్తి పాల్గొన్నారు.

సేవలతో గుర్తుండిపోతారు

సేవలతో ఎవరైనా చిరకాలం గుర్తుండిపోతారని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. స్థానిక ఆల్‌ఆంధ్ర రోడ్‌లో గల ఎంపీపీ స్కూల్‌లో వ్యాపారి శాసనపురి మహేశ్వరరావు సొంత నిధులు సుమారు రూ.6.5లు లక్షలతో నిర్మించిన అదనపు గదులను ఎమ్మెల్యే గురువారం ప్రారంభించారు.

గురుకులాలను వినియోగించుకోండి

డా.బీఆర్‌ అంబేద్కర్‌ గురుకులాలలో 2026-27 విద్యా సంవత్సరానికిగానూ ప్రవేశ అవకాశాలను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే మామిడి గోవింద రావు తెలిపారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో గురుకులాల ప్రవేశాలపై అవగాహన పోస్టర్‌ను గురువారం ఆవిష్కరించారు.

సమస్యలను ప్రస్తావించండి

పాతపట్నం రూరల్‌, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): బడ్జెట్‌లో తమ సమస్యలను ప్రస్తావించాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు ఉద్యోగ సంఘం నాయకులు విన్నవించారు. గురువారం బూరగాంలో ఆయనను కలిసి.. పెండింగ్‌లో ఉన్న బకాయిలు విడుదల చేయించాలని కోరారు. వినతిపత్రాన్ని అందించిన వారిలో జిల్లా అధ్యక్షుడు సిమ్మ సోమేశ్వర్‌రావు, కార్యదర్శి మాసపు సంతోష్‌కుమార్‌, ఇప్పిలి నారాయణరావు, కె.లక్ష్మీనారాయణ, ఎన్‌.మధు, బి.లింగమూర్తి, బి.సూర్య నారాయణ పాల్గొన్నారు.

Updated Date - Feb 05 , 2026 | 11:49 PM