వేగంగా సేవలందించడమే లక్ష్యం: కలెక్టర్
ABN , Publish Date - Jan 29 , 2026 | 11:58 PM
:ప్రభుత్వ సేవలను మరింత వేగంగా ప్రజలకు అందించడమే లక్ష్యమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్క ర్ తెలిపారు. గురువారం సాయంత్రం అమరావతి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, డీఆర్వో లక్ష్మణమూర్తి, వివిధశాఖల అధికారులతో కలిసి పాల్గొన్నారు.
శ్రీకాకుళంకలెక్టరేట్, జనవరి29(ఆంధ్రజ్యోతి):ప్రభుత్వ సేవలను మరింత వేగంగా ప్రజలకు అందించడమే లక్ష్యమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్క ర్ తెలిపారు. గురువారం సాయంత్రం అమరావతి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, డీఆర్వో లక్ష్మణమూర్తి, వివిధశాఖల అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలో అమలవు తున్న వివిధ ప్రాధాన్యతా అంశాలను సీఎస్‌కు వివరించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటులకు భూసేకరణ ప్రక్రి యను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. మనమిత్రయాప్ ద్వారా పౌర సేవలు పొందడంపై గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వాసుపత్రులు, ప్రధాన ఆలయాల్లో క్యూఆర్ కోడ్‌లను ఏర్పాటు చేసి, సేవలపై ప్రజల నుంచి నేరుగాఅభిప్రాయాలను సేకరిస్తున్నామని,తద్వారా ప్రజల సంతృప్తి స్థాయిని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.