ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యం
ABN , Publish Date - Sep 10 , 2026 | 11:44 PM
ప్రజలకు మరింత చేరువగా ఉంటూ మెరుగైన సేవలు అందించడమే ‘కాఫఫీ విత్ ఎమ్మెల్యే’ కార్యక్రమ లక్ష్యమని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు.
ఎమ్మెల్యే మామిడి గోవిందరావు
పాతపట్నం, సెప్టెంబరు 10(ఆంధ్ర జ్యోతి): ప్రజలకు మరింత చేరువగా ఉంటూ మెరుగైన సేవలు అందించడమే ‘కాఫఫీ విత్ ఎమ్మెల్యే’ కార్యక్రమ లక్ష్యమని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో కాఫీ విత్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఇందులో భాగంగా సరాళి, తిడ్డిమి, రంకిణి, దశరథపురం, చంగుడి గ్రామాల నాయకులతో ముఖాముఖి సమావేశ మయ్యారు. గ్రామాలలో ప్రజా సమస్యలు, మౌలిక వసతులు, రహదారులు, తాగునీరు, పారిశుధ్యం తదితర అంశాలపై నాయ కులతో చర్చించారు. రెండేళ్ల పాలనలో ఆ గ్రామాలలో చేపట్టిన సంక్షేమ కార్య క్రమాలపై చర్చించారు. ప్రజా సమస్యలు పరిష్కరించే వేదికగా కాఫీ విత్ ఎమ్మేల్యే కార్యక్రమం ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అదే ధ్యేయం
ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలతో మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. స్థానిక పంచాయతీ కార్యాలయ చేరువలో నూతన బస్ షెల్టర్ నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేశారు.
పాసు పుస్తకాలతో భద్రత
రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలతో రైతుల భూములకు ప్రభుత్వం సంపూర్ణ భద్రత కల్పిస్తుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. కొరసవాడలో పట్టాదారు పాసు పుస్తకాలను గురువారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, తహసీల్దార్ బి.వెంకట రమణ కూటమి నాయకులు పాల్గొన్నారు. అనంతరం స్థానిక క్యాంపు కార్యా లయంలో వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశాన్నినిర్వహించారు.