Share News

‘ప్రతి మహిళనూ వ్యాపారవేత్తగా తీర్చిదిద్దడం లక్ష్యం’

ABN , Publish Date - May 26 , 2026 | 11:24 PM

ప్రతి కుటుంబంలోని ఒక మహిళను వ్యాపారవేత్తగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయాలని మెప్మా పథక సంచాలకులు బి.శైలజ, మునిసిపల్‌ కమిషనర్‌ ఎన్‌.రమేష్‌ అన్నారు.

 ‘ప్రతి మహిళనూ వ్యాపారవేత్తగా తీర్చిదిద్దడం లక్ష్యం’
మాట్లాడుతున్న మెప్మా పీడీ బి.శైలజ

ఇచ్ఛాపురం, మే 26 (ఆంధ్రజ్యోతి): ప్రతి కుటుంబంలోని ఒక మహిళను వ్యాపారవేత్తగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయాలని మెప్మా పథక సంచాలకులు బి.శైలజ, మునిసిపల్‌ కమిషనర్‌ ఎన్‌.రమేష్‌ అన్నారు. ఈమేరకు స్థానిక మునిసిపల్‌ సమావేశ మందిరంలో మెప్మా టీఎంసీలు, సీవోలు, ఆర్పీలతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బ్యాంకు లింకేజీ, కేంద్రప్రభుత్వ పథకాలు ఇప్పిస్తూ లింకేజీ తీసుకున్న సంఘ సభ్యులందరూ వ్యాపారాలు నిర్వహించేలా చూడాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి సభ్యురాలికి పీఎం స్వానిధి రుణాలు ఇప్పించాలన్నారు. కార్యక్రమంలో ఐబీ రాము, బీఎల్‌ శారదావాణి, కిషోర్‌, భాస్కరరావు, బాలరాజు, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 26 , 2026 | 11:24 PM