Share News

పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం

ABN , Publish Date - Sep 26 , 2026 | 12:10 AM

రాష్ట్రంలో ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశలో సీఎం చంద్రబాబు నాయుడు చర్యలు తీసు కుంటున్నారని ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు.

పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం
మంజూరు పత్రాలు అందిస్తున్న ఎమ్మెల్యే రవికుమార్‌

ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌

ఆమదాలవలస, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశలో సీఎం చంద్రబాబు నాయుడు చర్యలు తీసు కుంటున్నారని ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు. శుక్రవారం మునిసిపాలిటీపరిధిలోని అర్హులైన పేద, మధ్య తరగతి కుటుంబాలకు మంజూరైన పీఎంఏవై గృహ నిర్మాణ మంజూరు పత్రాలను మునిసిపల్‌ కార్యాలయంలో లబ్ధిదా రులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. అర్హత ఉన్న ప్రతి కుటుం బానికి ప్రభుత్వ పథకాలు ద్వారా ప్రయోజనం అందేలా కృషి చేస్తామన్నారు. కూటమి ప్రభు త్వం సంక్షేమానికి, గృహ నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తుందన్నారు. 92 కుటుంబాలకు గృహ నిర్మా ణ మంజూరు పత్రాలు అందించడంతో లబ్ధిదా రులు ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలి పారు. కార్య క్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు మొదలవలస రమేష్‌, కమిషనర్‌ తమ్మినేని రవి, మునిసిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ తమ్మినేని గీతా విద్యాసాగర్‌, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎస్‌.మురళీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 26 , 2026 | 12:10 AM