ఆరోగ్యకర సమాజ స్థాపనే లక్ష్యం
ABN , Publish Date - Nov 19 , 2026 | 12:09 AM
ఆరోగ్యకర సమాజ స్థాపనే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని కార్పొరేషన్ కమిషనర్ శ్రావణ్‌కుమార్ అన్నారు.
నగర కమిషనర్ శ్రావణ్‌కుమార్
శ్రీకాకుళం అర్బన్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి) ఆరోగ్యకర సమాజ స్థాపనే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని కార్పొరేషన్ కమిషనర్ శ్రావణ్‌కుమార్ అన్నారు. తండేంవలసలోని డంపిం గ్‌యార్డ్‌ను బుధవారం సందర్శించి అక్కడ చేపడు తున్న లెగసీ వేస్ట్ ప్రాసెసింగ్ పనులను పరిశీ లించారు. పాత చెత్తను శాస్ర్తీయ పద్ధతుల్లో శుద్ధి చేసి వ్యర్థాల పరిమా ణాన్ని తగ్గించే ప్రక్రియపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. డంపింగ్‌యార్డులో దుర్వాసన, దోమలవ్యాప్తి, కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సూ చించారు. మునిసిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పి.సుధీర్‌కుమార్ మాట్లాడు తూ.. ప్రజలు తడి, పొడి చెత్త ను వేర్వేరుగా అందించి పరిసరాల పరిశుభ్రతకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మునిసిపల్ ఇంజనీర్ కె.రవి శర్మ, అసిస్టెంట్ ఇంజనీర్ సృజన, ఇంజనీరింగ్, ప్రజారోగ్య విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.