సర్వాంగ సుందరంగా జిల్లా ఏర్పాటు లక్ష్యం
ABN , Publish Date - Aug 15 , 2026 | 12:20 AM
జిల్లాను సర్వాంగ సుందరంగా చేయడమే ప్రధాన లక్ష్యమని కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు అన్నారు.
కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్, అచ్చెన్నాయుడు
శ్రీకాకుళం అర్బన్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాను సర్వాంగ సుందరంగా చేయడమే ప్రధాన లక్ష్యమని కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం నగర పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కలెక్టర్ స్వప్ని ల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. పీఎన్‌కాలనీ, మహలక్ష్మినగర్ కాలనీల్లో విద్యుత్ సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన చేశారు. పొట్టి శ్రీరాములు జంక్షన్ నుంచి రంగిరీజువీధి జంక్షన్ వరకు సీసీ రోడ్డు, కాలువ పనులకు శంకుస్థాప న చేశారు. ఏడు రోడ్ల జంక్షన్ నుంచి రామలక్ష్మణ జంక్షన్ వరకు ఏర్పా టు చేసిన సెంటర్ లైటింగ్‌ను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. పుణ్యపు వీధి నుంచి తురాయిచెట్టు వీధి వరకు నిర్మించిన క్రాస్ కల్వర్టును ప్రారంభించారు. నీటిపారుదల శాఖ ఎస్‌ఈ కార్యాలయాన్ని ప్రారం భించారు. కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ శ్రావణ్‌కుమార్, ముని సిపల్ మాజీ చైర్‌పర్సన్ పైడిశెట్టి జయంతి పాల్గొన్నారు.
వమరవెల్లిలో ‘రెండేళ్ల నమ్మకం’
గార, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షే మం’ కార్యక్రమం వమరవెల్లిలో శుక్రవారం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు, ఎమ్మె ల్యే గొండు శంకర్ ఇంటింటికీ వెళ్లి కరపత్రాలిచ్చి వివరించారు. కార్య క్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు లోపింటి రాధాకృష్ణ, కళింగ వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పొట్నూరు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.