చెప్పింది చేయడమే లక్ష్యం
ABN , Publish Date - Oct 12 , 2026 | 12:06 AM
‘మాటిచ్చామంటే చాలు వాటిని అమలుచేసి తీరుతాం. చెప్పింది చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం. అభివృద్ధి, సంక్షేమం సమాంతరంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుంది’
టెక్కలి, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): ‘మాటిచ్చామంటే చాలు వాటిని అమలుచేసి తీరుతాం. చెప్పింది చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం. అభివృద్ధి, సంక్షేమం సమాంతరంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుంది’ అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఆదివారం టెక్కలిలో రూ.2 కోట్ల 60 లక్షలతో టెక్కలి నుంచి పోలవరం వరకు బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి పూర్తిగా కుంటిపడిందని, కూటమి ప్రభుత్వం బాధ్యతగా మౌలిక సదుపాయాలు కల్పనలో ముందువరుసలో ఉందని తెలిపారు. రహదారుల నిర్మాణానికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బగాది శేషగిరి, ఎల్‌ఎల్ నాయుడు, లవకుమార్, హను మంతు రామకృష్ణ, పోలాకి షణ్ముఖరావు, మామిడి రాము, దల్లి ప్రసాద్‌రెడ్డి, ఆర్‌అం డ్‌బీ ఎస్‌ఈ సత్యనారాయణ పాల్గొన్నారు.