మోడల్ క్లస్టర్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: రవికుమార్
ABN , Publish Date - Jun 22 , 2026 | 12:02 AM
పొందూరులో నిర్మితమవు తున్న క్లస్టర్‌ను మోడల్‌గా తీర్చిది ద్దడమే తన లక్ష్యమని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు.
పొందూరు, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): పొందూరులో నిర్మితమవు తున్న క్లస్టర్‌ను మోడల్‌గా తీర్చిది ద్దడమే తన లక్ష్యమని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. పొందూ రులో సాయి బాబా చేనేత సొసైటీ ఆవరణలో రూ.50 లక్షల ప్రత్యేర అభివృద్ధి ప్యాకేజీ (ఎస్ డీపీ) నిధులతో నిర్మిం చిన కామన్ ఫెసిలిటేట్ సెంటర్‌ను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. పొందూరులో 5 ఎకరాల్లో రూ.12 కోట్లతో చేనేత, ఖాదీ క్లస్టర్ నిర్మా ణం చేపట్టనున్నామని, దీనికోసం 500 మంది మహిళలకు సెర్ప్ ఆధ్వ ర్యంలో ఆధునాతన చేనేత ఖాదీ వస్త్రాల నేతలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నా మన్నారు.
సీసీ రోడ్డు ప్రారంభం
దల్లవలస పంచాయతీ ఎస్‌జీఎన్‌పేటకు రూ. 40 లక్షల ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో నిర్మించిన సీసీ రోడ్డును ఆయన ప్రారంభించారు. గ్రామాల్లో రోడ్లు, కాలువలు, ఇతర అభివృద్ధి కార్యక్ర మాలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు సీహెచ్ రామ్మోహన్, పార్టీ జిల్లా కార్యదర్శి సీసాన శ్రీరంగనాయకులు, టీడీపీ నేతలు బలగ శంకరభాస్కర్, బాడాన గిరి, ఎంపీటీసీ హారిక, ఎ.వాణి, చేనేత సొసైటీ మేనేజర్ శ్రీనివాసరావు, పీఆర్ డీఈ చంద్రశేఖర్, ఏఈ దయాసాగర్, ఏపీఎం. జి.శ్యామ్‌కుమార్ పాల్గొన్నారు.