Share News

మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయం

ABN , Publish Date - Mar 15 , 2026 | 12:09 AM

గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్ప నే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మె ల్యే గౌతు శిరీష తెలిపారు.

 మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయం
హరిపురం: బాలిగాంలో రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే గౌతు శిరీష :

హరిపురం, మార్చి14 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్ప నే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మె ల్యే గౌతు శిరీష తెలిపారు. శనివారం మందస మండలంలోని బాలిగాం బీసీ కాలనీలో రూ.17లక్షలతో సీసీ రోడ్ల పను లకు శంకుస్థాపన చేశారు. అనం తరం హరిపురం- బాలిగాంకూడలి నుంచి పాత జాతీయ రహదారిలో రూ.11లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం ప్రజలనుంచి వినతులను స్వీకరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సాలిన మాధవరావు, తమిరి భాస్కరరావు, దాసరితాతారావు, రట్టి లింగరాజు, లబ్బ రుద్రయ్య, బమ్మిడి కర్రయ్య, చంద్రశేఖర్‌, కోనారి తులసీరావు, అడ్డి ఈశ్వరరావు పాల్గొన్నారు.

కాశీబుగ్గలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌

కాశీబుగ్గ, మార్చి 14(ఆంధ్రజ్యోతి): ఆడపిల్లల ఆరోగ్యం కుటుంబానికి, సమాజానికి ఎంతో ముఖ్యమని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. శనివారం కాశీబుగ్గ హైస్కూల్‌లో పలాస పీహెచ్‌సీ ఆధ్వర్యంలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర బీసీ సెల్‌ ప్రధాన కార్యదర్శి లొడగల కామేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్‌ శ్రీనివాస్‌రావు, ఎం.చిన్ని, మునిసిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసులు, ఉమాకాంత్‌, గోవింద్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 15 , 2026 | 12:09 AM