గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయం
ABN , Publish Date - Sep 30 , 2026 | 11:57 PM
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడు కుదిటి ఈశ్వరరావు అన్నారు.
ఎంపీ కలిశెట్టి, ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్
రణస్థలం, సెప్టెం బరు 30 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడు కుదిటి ఈశ్వరరావు అన్నారు. లావేరు మండలం బొంతుపేట సమీపం లో ఎన్‌హెచ్-16 నుంచి గుమడాం మీదుగా కృష్ణాపురం జంక్షన్ వరకు చేపట్టనున్న బీటీ రోడ్డు పునర్నిర్మాణ పనుల కు బుధవారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి లంక శ్యామలరావు, జనసేన ఇన్‌చాార్జి విశ్వక్సేన్ పాల్గొన్నారు.
‘యువతకు ఉద్యోగ, ఉపాధి లక్ష్యం’
ఎచ్చెర్ల రూరల్, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ వసతి గృహం, మెస్‌లను బుధవారం పరిశీలించారు. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు, ఉద్యోగ నోటిఫికేషన్లు, పరిశ్రమల స్థాపన, ఎంవో యూలపై విద్యార్థులతో చర్చించారు. కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి లంక శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు.
------