మెరుగైన రోడ్ల నిర్మాణం లక్ష్యం: ఎమ్మెల్యే శంకర్
ABN , Publish Date - Jan 10 , 2026 | 11:30 PM
గ్రామాలకు మెరుగైన రోడ్ల నిర్మాణం చేపట్టడం కూటమి ప్రభు త్వ లక్ష్యమని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.
శ్రీకాకుళం రూరల్, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): గ్రామాలకు మెరుగైన రోడ్ల నిర్మాణం చేపట్టడం కూటమి ప్రభు త్వ లక్ష్యమని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకా కుళం రూరల్ మండలం లంకాం పంచాయతీ లింగాల వలస నుంచి రాగోలు ఎస్‌ఎస్‌వలస వరకు చేపడుతున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రోడ్డు నిర్మాణం పూర్త యిన వెంటనే లింగాలవలస నుంచి శ్రీకాకుళం వచ్చేం దుకు 4 కి.మీటర్ల దూరం తగ్గుతుందన్నారు. రూ.38 లక్షల వీబీజీ రామ్‌జీ నిధు లతో చేపడుతున్నా మన్నారు. ఆర్‌ఎంసీ 27 వద్ద ఓ వైపు కల్వర్టు నిర్మాణానికి కూడా చర్యలు తీసుకుంటామని, ఈ మేరకు ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు పంపుతామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, పీఆర్ ఇంజనీర్లు, గ్రామస్థులు పాల్గొన్నారు.
రాగోలు పంచాయతీ ప్రధాన మార్గంలో జరుగుతున్న కాలువ పనులను ఎమ్మెల్యే శంకర్ పరిశీ లించారు. భవిష్యత్‌లో మురుగునీటి సమ స్య ఉత్పన్నం కాకుండా తగుచర్యలు తీసు కోవాలని అధికారులకు సూచించారు. కార్య క్రమంలో స్థానిక పార్టీ నేతలు పాల్గొన్నారు.
ముగ్గులు మన సంస్కృతికి ప్రతీక
అరసవల్లి, జనవరి 10(ఆంధ్రజ్యోతి): తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలకు ముగ్గులు ప్రతీక అని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరం రైతు బజారు రోడ్డులోని వరసిద్ధి వినాయక దేవా లయం ఎదురుగా సం క్రాంతి పండుగను పురస్కరించుకుని మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు ఎమ్మెల్యే బహుమ తులు అందించారు. ముందు తరాలకు ఇటువంటి వాటిని అందించేందుకు నిర్వాహకులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు పాండ్రంకి శంకర్, నేతలు నాగేంద్రయాదవ్, కవ్వాడి సుశీల, బీజేపీ నాయకురాలు డాక్టర్ పైడి సింధూర తదితరులు పాల్గొన్నారు.