Share News

మెరుగైన రోడ్లు నిర్మాణమే లక్ష్యం

ABN , Publish Date - Feb 16 , 2026 | 12:16 AM

గ్రామాలకు మెరు గైన రోడ్ల నిర్మాణం కూటమి ప్రభుత్వం లక్ష్య మని, ఈ దిశగా చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు.

మెరుగైన రోడ్లు నిర్మాణమే లక్ష్యం

ఎమ్మెల్యే రవికుమార్‌

బూర్జ, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): గ్రామాలకు మెరు గైన రోడ్ల నిర్మాణం కూటమి ప్రభుత్వం లక్ష్య మని, ఈ దిశగా చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు. కొల్లివలస పంచా యతీ జంక్షన్‌ నుంచి అక్కులపేట వరకు రూ. 2.80 కోట్లతో సుమారు 12 కి.మీ.రోడ్డు నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. వైసీపీ ప్రభుత్వంలో ఒక్క ఏడాది కూడా రోడ్ల ను పట్టించుకోలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం లో రోడ్ల నిర్మాణం చేపడు తోందన్నారు. కార్యక్రమంలో మార్క్‌ ఫెడ్‌ డైరెక్టర్‌ ఎ.రామకృష్ణనాయుడు, ఆర్‌అండ్‌బీ జేఈ ఆంజ నేయ నాయక్‌, ఎంపీడీవో తిరుపతిరావు, తహసీ ల్దార్‌ పద్మావతి, నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి పి. రామ్మోహన్‌రావు, నగర కుల కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కన్నం నాయుడు తదితరులు పాల్గొన్నారు.

మహిళా సాధికారిత సాధనకు సీఎం కృషి

ఆమదాలవలస, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం లో స్వయంశక్తి సంఘాల మహిళలు అన్ని రంగాల్లో సాధికారిత సాధించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని, ఈ దిశగా కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్‌ కూన రవికుమార్‌ అన్నారు ఆదివారం పట్టణంలోని వెలుగు కార్యాల యంలో జెండర్‌ రిసోర్స్‌సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ.. మహిళలు అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా, సామా జికంగా చైతన్యం కావాలని కోరారు. కార్యక్ర మంలో డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌కుమార్‌, టీడీపీ నాయ కులు తమ్మినేని చంద్రశేఖర్‌, సనపల ఢిల్లీశ్వరరావు, నూకరాజు, రాష్ట్ర మెడికల్‌ బోర్డు సభ్యుడు డాక్టర్‌ చాపర సుధాకర్‌, ఎంఎంఎస్‌ అధ్యక్షురాలు ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

భక్తుల మనోభావాలను గౌరవించాలి

పొందూరు, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): ఏ మత మైనా భక్తుల మనోభావాలను పాలకులు, నాయకులు గౌరవించాలని ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు. రాపాక వర లక్ష్మి పేరంటాలు ఆలయ వార్షికోత్సవం సం దర్భంగా అమ్మవారిని ఆదివారం దర్శించుకున్నారు. వైసీ పీ ప్రభుత్వంలో తిరుమల వెంకన్న లడ్డూప్రసాదాన్ని కల్తీ చేసి భక్తుల మనో భావాలను దెబ్బ తీశారన్నారు. టీడీపీ నేతలు సీహెచ్‌ రామ్మోహన్‌, బలగ శంకర భాస్కర్‌, ఖండాపు శ్రీనివాసరావు తదితరులున్నారు.

సీసీ రోడ్డు నిర్మాణ శిలాఫలకం ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే రవికుమార్‌ ( రవికుమార్‌)

Updated Date - Feb 16 , 2026 | 12:16 AM