ప్రజలు కళ్లల్లో ఆనందం నింపడమే ఽధ్యేయం
ABN , Publish Date - Jan 13 , 2026 | 11:40 PM
గ్రామీణ ప్రజల కళ్లల్లో ఆనందం నింపడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. మంగళవారం మండలంలోని చల్లవానిపేట నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో మాట్లాడుతూ ప్రజలు బాగోగులు కోసం గ్రామాల్లో ప్రభుత్వం ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తోందన్నారు.
జలుమూరు, జనవరి 13 (ఆంధ్రజ్యోతి):గ్రామీణ ప్రజల కళ్లల్లో ఆనందం నింపడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. మంగళవారం మండలంలోని చల్లవానిపేట నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో మాట్లాడుతూ ప్రజలు బాగోగులు కోసం గ్రామాల్లో ప్రభుత్వం ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తోందన్నారు. మెయిన్ వీధిలో వేసిన సంక్రాంతి ముగ్గులు, హరిదాసు వేషధారణ, గంగిరెద్దులు విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అనంతరం హరిదాసును, వేద పండితులను ఎమ్మెల్యే సన్మానించారు. కార్యక్రమంలో నియోజకవర్గం సమన్వయకర్త బగ్గు అర్చన, సర్పంచ్ పంచిరెడ్డి రామచంద్రరావు, ఎంపీటీసీ పొన్నాన భారతి, టీడీపీ మండలాధ్యక్షులు వెలమల రాజేంద్రనాయుడు, జలుమూరు ఏఎంసీ చైర్మన్ తర్ర బలరాం, చల్లవానిపేట, అల్లాడ సొసైటీ అధ్యక్షులు దుంగ స్వామిబాబు, వెలమల చంద్రభూషణరావు పాల్గొన్నారు.