Share News

గ్రామాల అభివృద్ధే ధ్యేయం

ABN , Publish Date - Aug 31 , 2026 | 12:30 AM

గ్రామా లను అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ ధ్యే యమని, ఈ దిశగా పనిచేస్తోందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు.

గ్రామాల అభివృద్ధే ధ్యేయం
అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎంపీ కలిశెట్టి, ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్‌

ఎంపీ కలిశెట్టి, ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్‌

రణస్థలం, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): గ్రామా లను అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ ధ్యే యమని, ఈ దిశగా పనిచేస్తోందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. ఆదివారం బంటుపల్లి పంచాయతీ కంబాలపేటలో సీసీ రోడ్లు, వాటర్‌ ట్యాంక్‌, ఆర్వో వాటర్‌ ప్లాంట్‌, అంగన్‌వాడీ కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. తన స్వగ్రామంతో పాటు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం అభివృద్ధి చెందా లనే సంక ల్పంతో ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు నిరంతరం పని చేస్తున్నారన్నారు.

‘అభివృద్ధికి అడ్డుపడితే బుద్ధి చెబుతాం’

రణస్థలం, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వ హయాంలో గ్రామాభివృద్ధి పరుగులు తీస్తోందని, అయితే దీనికి అడ్డుపడితే గొడ్డలి పార్టీ నాయకులకు తగిన బుద్ధి చెప్పక తప్పదని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. ఆదివారం బంటుపల్లిలో నమస్తే ఎచ్చెర్ల కార్యక్రమం బీఎల్‌ ఏ-1 నడుకుదిటి తేజాబాబు ఆధ్వర్యంలో నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఎన్‌ఈఆర్‌ మాట్లాడుతూ.. బంటుపల్లి తన కన్న తల్లితో సమానమని, గ్రామాభివృద్ధికి తన ఉన్నతమైన వ్యాపా రాలు విడిచిపెట్టి, గ్రామంలో స్థిరపడ్డానన్నారు. బంటుపల్లి అభివృద్ధికి గొడ్డలి పార్టీ నాయకులు అడుగడుగునా అడ్డు పడి తప్పుడు పోలీస్‌ కేసులు పెట్టి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారన్నారు. ఈ ఇబ్బందులను తట్టుకోలేక గ్రామాన్ని, అనుచరులను కాపాడుకునేందుకు బీజేపీలో చేరానన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో సర్పంచ్‌, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించుకుంటామన్నారు. కార్యక్రమంలో కూటమి నేతలు చౌదరి బాబ్జీ, ముప్పిడి సురేష్‌, బెండు మల్లేశ్వరరావు, లంక శ్యామలరావు, పిన్నింటి భానోజి నాయుడు, టొంపల అప్పల రాజు, రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం ఉపాధ్యక్షురాలు నడుకుదిటి రజిని. నాయకులు ముప్పిడి సురేష్‌, నడుకుదిటి తేజాబాబు, నడుకుదిటి రజిని, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 31 , 2026 | 12:30 AM