Share News

పల్లెల అభివృద్ధే ధ్యేయం

ABN , Publish Date - Apr 12 , 2026 | 11:45 PM

పల్లెల అభివృద్ధే కూటమి ప్రభుత్వం ఽధ్యేయమని కేంద్ర పౌరవిమానయాన శాఖమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు.

  పల్లెల అభివృద్ధే ధ్యేయం
శ్రీకాకుళం రూరల్‌: రాయపాడులో పర్యటిస్తున్న కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్‌:

శ్రీకాకుళం రూరల్‌, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): పల్లెల అభివృద్ధే కూటమి ప్రభుత్వం ఽధ్యేయమని కేంద్ర పౌరవిమానయాన శాఖమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు. ఆదివారం శ్రీకాకుళం రూరల్‌ మండలంలోని రాగోలు, రాయపాడు పంచా యతీలపరిధిలో రూ.46 లక్షల ఉపాధి నిధులతో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే గొండు శంకర్‌, కూటమి శ్రేణులతో కలిసి రామ్మోహన్‌నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెలకు అన్ని వైపుల రోడ్లను నిర్మించడం వల్ల వేగంగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు సీర రమణయ్య, చిట్టి మోహన్‌, గేదెల శ్యామలరావు, బలగ చెంగలరావు పాల్గొన్నారు.

Updated Date - Apr 12 , 2026 | 11:45 PM