గ్రామాభివృద్ధే లక్ష్యం
ABN , Publish Date - May 14 , 2026 | 11:40 PM
పార్టీలు చూడకుండా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ తెలిపారు. గ్రామాలాభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ ఐకమత్యంతో పనిచేయాలని కోరారు.
ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్
సోంపేట రూరల్, మే 14 (ఆంధ్రజ్యోతి): పార్టీలు చూడకుండా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ తెలిపారు. గ్రామాలాభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ ఐకమత్యంతో పనిచేయాలని కోరారు. గురువారం మామిడిపల్లి పంచాయతీ పరిధిలోని మూడు గ్రామాల్లో రూ.కోటిన్నరతో పూర్తయిన సీసీ రోడ్లు, డ్రైనేజీల పనులు ప్రారంభించారు. ఈసందర్భంగా జరిగిన బహిరంగ సభలో అశోక్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిగ్రామానికి మౌలిక వసతులు వందశాతం పూర్తి చేశామన్నా రు. గ్రామపెద్దలు పాతిన కృష్ణమూర్తి, షావుకారు దివాకర్, నూకల సోమేష్ మాట్లాడుతూ మామిడిపల్లి అభివృద్ధికి ఎమ్మెల్యే అశోక్, కేంద్రమంత్రి రామ్మోహన్‌ల సహకారాన్ని అందించారన్నారు. ఈనెల 18 నుంచి 26 వరకు జరగనున్న సాగరాల పోలమ్మ సంబరాల కోసం అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు దాసరిరాజు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సూరాడ చంద్రమోహన్, పార్టీ మండలాధ్యక్షుడు మడ్డుకుమార్, మద్దిలి నాగేశ్వరరావు, పంచాయతీ అధ్యక్షుడు దున్న వీరస్వామి, నాయకులు తిమ్మల వీరాస్వామి, సింహాచలం పాల్గొన్నారు.