Share News

సాగునీరు, ఉపాధి కల్పనే లక్ష్యంగా

ABN , Publish Date - Feb 24 , 2026 | 12:07 AM

Working towards achieving Erranna's dream ‘సిక్కోలు ముద్దుబిడ్డ కింజరాపు ఎర్రన్నాయుడు. జిల్లాకు పూర్తిస్థాయి సాగునీరు, ఉపాధి కల్పనే ఆయన ప్రధాన ఆశయాలు. అందుకు అనుగుణంగా పని చేస్తున్నామ’ని కేంద్ర పౌరవిమానాయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు పేర్కొన్నారు.

సాగునీరు, ఉపాధి కల్పనే లక్ష్యంగా
ఎర్రన్నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు

ఎర్రన్న ఆశయ సాధనకు కృషి

కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు

అరసవల్లి, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): ‘సిక్కోలు ముద్దుబిడ్డ కింజరాపు ఎర్రన్నాయుడు. జిల్లాకు పూర్తిస్థాయి సాగునీరు, ఉపాధి కల్పనే ఆయన ప్రధాన ఆశయాలు. అందుకు అనుగుణంగా పని చేస్తున్నామ’ని కేంద్ర పౌరవిమానాయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు పేర్కొన్నారు. ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా శ్రీకాకుళంలోని 80 అడుగుల రోడ్డు, ఏడురోడ్ల కూడలి, శ్రీకాకుళం సింహద్వారం, పాత ఎంపీ కార్యాలయం వద్ద ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కేంద్రమంత్రి మాట్లాడుతూ.. ‘ఎర్రన్న రాజకీయ పంథా అందరికీ అనుసరణీయం.. ఒక పాఠం వంటిది. ఎర్రన్న ఆశయాలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాం. నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఏడాదిలోగా శంకుస్థాపన చేస్తాం. వలసలు నివారించి.. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేలా పరిశ్రమలు స్థాపిస్తాం. పోర్టు పనులు పూర్తయితే.. జిల్లాలో మత్స్యకారులు, యువతకు ఉపాధి లభిస్తుంది. జిల్లాలో రేర్‌ ఎర్త్‌ మాగ్నెట్‌ కారిడార్‌ ఏర్పాటుకు ఇప్పటికే కేంద్రంతో చర్చించాం’ అన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు మొదలవలస రమేష్‌, టీడీపీ నగర అధ్యక్షుడు పాండ్రంకి శంకర్‌, డీసీఎంఎస్‌ చైౖర్మన్‌ చౌదరి అవినాష్‌, మునిసిపల్‌ మాజీచైర్మన్‌ పైడిశెట్టి జయంతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 24 , 2026 | 12:07 AM