Share News

అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం

ABN , Publish Date - Apr 26 , 2026 | 12:01 AM

పలాస-కాశీ బుగ్గ మున్సి పాలిటీలో అభివృద్ధి, సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు.

అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం
సీతమ్మకాలనీలో రోడ్డును ప్రారంభిస్తున్న ఎమ్మెలే ్య గౌతు శిరీష

  • పలాస ఎమ్మెల్యే శిరీష

పలాస, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): పలాస-కాశీ బుగ్గ మున్సి పాలిటీలో అభివృద్ధి, సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. శనివారం సాయంత్రం స్థానిక 27వ వార్డు సీతమ్మతల్లి కాలనీలో నిర్మించిన రోడ్డును ఆమె ప్రారం భించి మాట్లాడారు. అన్నీ వార్డు ల్లోను అభివృద్ధి పనులు చేపడతా మని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.90 లక్షల నిధులు ఇచ్చిందని, వాటితో రహదారులు, కాలువ పనులను చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏపీటీపీసీ చైర్మన్‌ వజ్జ బాబూరావు, ఏఎంసీ చైర్మన్‌ మల్లా శ్రీనివాస్‌, గురిటి సూర్యనా రాయణ, బడ్డ నాగరాజు, సప్ప నవీన్‌, గాలి కృష్ణారావు, టంకాల రవిశంకర్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు. అలాగే 27వ వార్డు ఉదయపురం కాలనీకి చెందిన సకలాబత్తుల లక్ష్మణరావు అనే దివ్యాంగుడు ఇటీవల విడుదలైన ఇంటర్‌ ఫలితాల్లో 972/1000 మార్కులు సాధించడంతో ఎమ్మెల్యే శిరీష ప్రత్యేకం గా అభినందించారు.

అమ్మవారి సంబరాల్లో..

వజ్రపుకొత్తూరు, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యో తి): పూండిలో పాలినవారి ఇంట జరుగు తున్న సింహాద్రి అప్పన్న సంబరాలల్లో శనివారం ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్ర మంలో టీడీపీ నాయకులు పుచ్చ ఈశ్వర్రావు, కర్ని రమణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2026 | 12:01 AM