Share News

ఆదర్శ మున్సిపాలిటీయే ధ్యేయం

ABN , Publish Date - Nov 24 , 2026 | 12:23 AM

పలా స-కాశీబుగ్గ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అ భివృద్ధి చేయడంతోపాటు ఆదర్శరంగా తీర్చి దిద్దడమే ధ్యేయంగా పనిచేయాలని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు.

ఆదర్శ మున్సిపాలిటీయే ధ్యేయం
ప్రమాణస్వీకారోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే శిరీష, కౌన్సిలర్లు, వారి బంధువులు

  • పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష

పలాస, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): పలా స-కాశీబుగ్గ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అ భివృద్ధి చేయడంతోపాటు ఆదర్శరంగా తీర్చి దిద్దడమే ధ్యేయంగా పనిచేయాలని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. మున్సిపాలిటీ నూతన పాలక వర్గం ప్రమాణస్వీకారోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడారు. ప్రజా ప్రతి నిధులంతా కలసికట్టుగా పనిచేయాలని, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. కౌన్సిలర్లు, చైర్‌పర్సన్‌ ప్రమాణస్వీకారం చివరి వరకూ ఎమ్మెల్యే పరిశీలించారు. కార్య క్రమంలో ఏపీటీపీసీ చైర్మన్‌ వజ్జ బాబూరావు, జిల్లా గ్రంధాలయసంస్థ చైర్మన్‌ పీరుకట్ల విఠల్‌ రావు, ఏఎంసీ చైర్మన్‌ మల్లా శ్రీనివాస్‌, జిల్లా రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి శాసనపురి మురళీకృష్ణ, నాయకులు లొడగల కామేశ్వరరావుయాదవ్‌, గాలి కృష్ణారావు, బడ్డ నాగరాజు, మున్సిపల్‌ కమిషనర్‌ ఇ.శ్రీనివాసు లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 24 , 2026 | 12:23 AM