Share News

ఆత్మహత్యల రహిత సమాజమే లక్ష్యం

ABN , Publish Date - Sep 10 , 2026 | 11:06 PM

ఆత్మహత్యల రహిత సమాజమే లక్ష్యమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఈవీఎన్‌ నరేష్‌కుమార్‌ పిలుపు నిచ్చారు.

ఆత్మహత్యల రహిత సమాజమే లక్ష్యం
ఎచ్చెర్ల రూరల్‌: ఎచ్చెర్ల పాత జాతీయరహదారిపై ర్యాలీ నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది :

ఎచ్చెర్ల రూరల్‌, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): ఆత్మహత్యల రహిత సమాజమే లక్ష్యమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఈవీఎన్‌ నరేష్‌కుమార్‌ పిలుపు నిచ్చారు. గురువారం ఎచ్చెర్ల పీహెచ్‌సీ ఆధ్వర్యంలో పాతజాతీయ రహదారిపై స్థానిక విద్యా సంస్థల విద్యార్థులతో కలిసి ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్‌బీఎస్‌కే అధికారి రజని, వైద్యాధికారులు ఉషశ్రీ, గంగా ప్రియదర్శని, నాగోజీ పాల్గొన్నారు.

ఫశ్రీకాకుళం కల్చరల్‌, సెప్టెంబరు10 (ఆంధ్రజ్యోతి): తొందరపాటు నిర్ణయాలతో జీవితం అర్థాంతరంగా ముగిసిపోతుందని, ఎదుటివారితో కష్టసుఖాలు పంచుకోవడం ద్వారా నిండునూరేళ్లు జీవించే అవకాశం ఉంటుందని కళ్లేపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి బి.నమ్రతప్రియ తెలిపారు. గురువారం కళ్లేపల్లి తదితర గ్రామాల్లో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ర్యాలీ నిర్వహించారు. కార్య క్రమంలో ఈవో గొర్రెల రవికుమార్‌ , హెల్త్‌అసిస్టింట్‌ ఇప్పిలి చిట్టిబాబు, పీహెచ్‌ఎన్‌ ముణి మంజరి, ప్రాఽథమిక ఆరోగ్యకేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.

ఫసరుబుజ్జిలి, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): వివిధ రంగాలకు చెందిన పెద్దలు, పిల్లలు క్షణికావేశానికి లోనై కుటుంబాలను శోకానికి గురిచేయవద్దని మండల వైద్యాధికారి డాక్టర్‌ కె.ప్రశాంత్‌ పేర్కొన్నారు. గురువారం స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రపంచఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా వైద్య సిబ్బందితో కలిసి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ పి.పద్మా వతి, సీహెచ్‌వో మోహన్‌రావు పాల్గొన్నారు.

Updated Date - Sep 10 , 2026 | 11:06 PM