Share News

ప్రతి పల్లెకూ రోడ్డు లక్ష్యం

ABN , Publish Date - Sep 20 , 2026 | 12:13 AM

రాష్ట్రంలో ప్రతి పల్లెకూ రోడ్డు సదుపాయం కల్పించడం కూటమి ప్రభుత్వ లక్ష్య మని రాష్ట్ర పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు.

 ప్రతి పల్లెకూ రోడ్డు లక్ష్యం
శిలాఫలకం ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే రవికుమార్‌

ఎమ్మెల్యే రవికుమార్‌

సరుబుజ్జిలి, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రతి పల్లెకూ రోడ్డు సదుపాయం కల్పించడం కూటమి ప్రభుత్వ లక్ష్య మని రాష్ట్ర పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు. అలికాం-బత్తిలి ప్రధాన రహదారి నుంచి ఒప్పడాం, అమృతలింగా నగరం గ్రామాలకు నిర్మించిన రోడ్డును, ప్రయా ణికుల విశ్రాంతి భవనాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల అభ్యు న్నతి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు. సంక్షేమ పథకాల సృష్టికర్తగా మారా రన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌ నేతృత్వంలో అన్ని గ్రామా లకు రోడ్ల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారన్నారు. కార్య క్రమంలో డీసీసీబీ చైర్మన్‌ శివ్వాల సూర్య నారాయణ, టీడీపీ నాయకులు అంబళ్ల రాంబాబు, కిల్లి సిద్ధార్థ, నూక కోటేశ్వరావు, లావేటి పూర్ణారావు, వి.రమేష్‌, ప్రభాకర్‌, ఎంపీడీవో పావని, జేఈ కూర్మానాథరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 20 , 2026 | 12:13 AM