ఏకపక్ష విజయమే లక్ష్యం
ABN , Publish Date - Oct 13 , 2026 | 12:15 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం ఏకపక్షంగా ఉండాలని... వార్ వన్ సైడ్ చేయాలని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
మంత్రి అచ్చెన్నాయుడు
కోటబొమ్మాళి, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం ఏకపక్షంగా ఉండాలని... వార్ వన్ సైడ్ చేయాలని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆయన సోమవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ నిర్ణయించిన అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం 28 నెలలుగా చేపట్టిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని మంత్రి సూచించారు. కూటమి భాగస్వామ్య పార్టీల నాయకులు పరస్పర సహహకారంతో పని చేయాలని మంత్రి పేర్కొన్నారు.
సీఎంఆర్‌ఎఫ్‌తో పేదలకు భరోసా
పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆపత్కాలంలో ముఖ్యమంత్రి సహాయనిధి (పీఎంఆర్‌ఎఫ్) అండగా నిలుస్తోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆయన సోమవారం స్థానిక ఎన్టీఆర్ కార్యాలయంలో టెక్కలి, నందిగాం, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి మండలాలకు చెందిన 67 మందికి రూ.33.70.344 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ బోయిన గోవిందరాజులు, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్, బోయిన రమేష్, బోయిన సత్యశ్రీనివాస్, వెలమల విజయలక్ష్మి కామేశ్వరరావు, కర్రి అప్పారావు, పూజారి శైలజ, కల్లి నాగయ్యరెడ్డి, తర్ర రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎంపీపీ మృతి తీరని లోటు
సంతబొమ్మాళి (కోటబొమ్మాళి), అక్టోబరు 12(ఆంధ్ర జ్యోతి): సంతబొమ్మాళి మాజీ ఎంపీపీ, టీడీపీ నాయకుడు కర్రి విష్ణుమూర్తి(70) ఆకస్మిక మృతి పార్టీకి తీరని లోటని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం నౌపడలోని విష్ణుమూర్తి నివాసానికి వెళ్లి ఆయన భౌతిక కాయంపై పూలమాలలు ఉంచి.. నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.
ఉత్సాహంగా రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలుకోటబొమ్మాళి, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): కొత్తమ్మతల్లి ఉత్సవాల్లో భాగంగా కోటబొమ్మాళిలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు సోమవారం సాయంత్రం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. స్థానిక జిల్లా పరిషత్ బాలుర ప్రభుత్వ పాఠశాల మైదానంలో నాలుగు రోజులపాటు జరిగే ఈ పోటీలను వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ఆసక్తిగా తిలకించారు. తొలుత బాలికల విభాగంలో కర్నూలు, కృష్ణా జిల్లాల జట్ల మధ్య పోటీ జరగ్గా.. పురుషుల విభాగంలో కడప, శ్రీకాకుళం జట్లు తలపడ్డాయి. రాష్ట్రస్థాయిలో బాలికల విభాగంలో 12 జిల్లాల జట్లు, పురుషుల విభాగంలో 21 జట్లు పాల్గొన్నాయి. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తి, స్నేహభావాన్ని ప్రదర్శించాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కింజరాపు హరివరప్రసాద్, బోయిన రమేష్, వెలమల విజయలక్ష్మి, కామేశ్వరరావు, టెక్కలి ఆర్డీవో ఎం. కృష్ణమూర్తి, క్రీడాభిమానులు పాల్గొన్నారు.
అన్ని స్థానాలు కైవసం చేసుకోవాలి
టెక్కలి, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): ‘అతి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నా యి. ఆ ఎన్నికల్లో అన్ని ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు గెలిచి తీరాల’ని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం సాయంత్రం పార్టీ కార్యకర్తలకు టెలీ కాన్ఫరెన్స్‌లో దిశా నిర్దేశం చేశారు. ఇప్పటికే గొడ్డలి పార్టీ పూర్తి గా నిర్వీర్యమైందని తెలిపారు. రెండేళ్ల కింద ట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన సై్ట్రక్‌రే ట్ ఆధారంగా ఈసారి అంతకుమించి ఫలి తాలు ఉండాలని తెలిపారు. గొడ్డలి పార్టీ బీసీ రిజర్వేషన్లకు అనేక అడ్డంకులు సృష్టిం చిందని ఆరోపించారు. స్థానిక ఎన్నికల నిర్వ హణలో జాప్యం జరిగితే రాష్ట్రానికి పదివేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని అన్నారు. మూడు విడతలుగా జరిగే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించేలా చూడాలని... స్థానికంగా గ్రూపులు లేకుండా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరిపించాలన్నారు. ఎన్నికల వేళ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి కొందరు దొంగ నాయ కులు చేరుతుంటారని... అటువంటి వారిని చేర్పించుకోవద్దన్నారు. కష్టాల్లో మన పార్టీని ఆదుకున్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సూచించారు. ఈ నెల రోజులు స్థానిక ఎన్నికలపై దృష్టి పెట్టాలని తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో ఏ గ్రామంలో చూసినా అభివృద్ధి జరిగిందని అన్నారు. మరో రూ.450కోట్లతో మిగిలిన పనులు కూడా పూర్తి చేస్తామన్నారు. త్వరలో వాండ్రాడ, కన్నెవలసలకు లిఫ్ట్ ఇరిగేషన్లు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. నేరడి బ్యారేజ్‌కు రూ.1,060కోట్లతో ప్రతిపాదనలు జరిగాయని, వాటి ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు.