ఫిట్ శ్రీకాకుళం లక్ష్యం
ABN , Publish Date - Aug 24 , 2026 | 12:04 AM
ఫిట్ శ్రీకాకుళం తన లక్ష్యమని, ఈ దిశలో అనేక క్రీడాపోటీలు నిర్వహిస్తున్నామని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.
కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు
శ్రీకాకుళం అర్బన్, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): ఫిట్ శ్రీకాకుళం తన లక్ష్యమని, ఈ దిశలో అనేక క్రీడాపోటీలు నిర్వహిస్తున్నామని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. నగరం లోని ఎన్టీఆర్ భవన్‌లో ఎంపీ కప్-2026 చెస్ టోర్నమెంట్ ముగింపు వేడుకలు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెస్ మెదడుకు అద్భుత వ్యాయామం అందిస్తుందని, ప్రత్యర్థుల ఎత్తులను పసిగట్టి ముందుచూపుతో వ్యవహ రించవచ్చన్నారు. క్రీడలతోనే ఆరోగ్యం, అభివృద్ధి సాధ్యమవుతాయన్నారు. జిల్లాలోని ప్రతి క్రీడాకారుడిని ప్రోత్సహిం చేందుకు ఎర్రన్న క్రీడా ఉత్సవాలకు శ్రీకారం చుట్టామన్నారు. ఇకపై ప్రతి నెలా ఒక క్రీడాంశంలో పోటీలు నిర్వహించి క్రీడా కారుల ప్రతిభ ను వెలికితీస్తామన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందించి అభినందించారు. అంతకుముందు దివంగత నేత ఎర్రన్నాయుడు చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్, వంశధార ప్రాజెక్టు కమిటీ చైర్మన్ అరవల రవీంద్రబాబు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తమ్మినేని సుజాత, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుంగ భాస్కర్, కొర్ను నాగార్జున ప్రతాప్, నగరపార్టీ అధ్యక్షుడు పాడ్రంకి శంకర్, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు మెండ దాసునాయుడు, టీఎన్ ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బలగ ప్రహర్ష, జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు సనపల భీమా రావు తదితరులు పాల్గొన్నారు.