Share News

ప్రభుత్వ పాఠశాలల్లో 100 శాతం అడ్మిషన్లే లక్ష్యం

ABN , Publish Date - Oct 09 , 2026 | 11:49 PM

ప్రభుత్వ పాఠశాలల్లో నూరుశాతం అడ్మిషన్లు సాధించడమే లక్ష్యం గా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ కృషి చేస్తున్నారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు.

 ప్రభుత్వ పాఠశాలల్లో 100 శాతం అడ్మిషన్లే లక్ష్యం
గార: కేజీబీవీ అదనపు భవన శిలాఫలకం ఆవిష్కరిస్తున్న కేంద్రమంత్రి రామ్మోహన్‌, మంత్రి అచ్చెన్నాయుడు, చిత్రంలో ఎమ్మెల్యే గొండు శంకర్‌

కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు

శ్రీకాకుళంలో పలు పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు

శ్రీకాకుళం అర్బన్‌, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో నూరుశాతం అడ్మిషన్లు సాధించడమే లక్ష్యం గా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ కృషి చేస్తున్నారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. విద్యాభివృద్ధి, మౌలిక వసతులకల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని పేర్కొ న్నారు. శుక్రవారం శ్రీకాకుళం నగరంతో పాటు రూరల్‌, గార మండలాల్లో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజ రాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించి, మరి కొ న్నింటికి శంకుస్థాపనలు చేశారు. పెద్దపాడు వద్ద అమృ త్‌ 2.0 పథకంలో భాగంగా రూ.25.34 కోట్లతో నిర్మిం చనున్న 1200 కిలోలీటర్ల సామర్థ్యం గల వాటర్‌ ట్యాంక్‌ కు శంకుస్థాపన చేశారు. సింగుపురం కేజీబీవీ పాఠ శాలలో అదనపు వసతి గదులను ప్రారంభించారు. గార మండ లం శాలిహుండాం కేజీబీవీ పాఠశాలలో నూతనంగా నిర్మించిన అదనపు భవనాలను ప్రారంభిం చారు. నగరంలోని ఎచ్చెర్ల వీధి ప్రాథ మిక పాఠశాలలో రూ.45 లక్షలతో చేపట్టిన భవ న మరమ్మతులు, విద్యార్థుల మరుగు దొడ్లు, ప్రహరీ, అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఎన్టీఆర్‌ మున్సి పల్‌ హైస్కూల్‌లో రూ.85 లక్షలతో ఏర్పాటు చేసిన జిల్లా సైన్స్‌ సెంటర్‌ను ప్రారంభిం చారు. గుజరాతిపేటలోని అంధవరపు వరహా నరసింహం మున్సిపల్‌ కార్పొరేషన్‌ హైస్కూ ల్‌లో రూ.1.11 కోట్లతో ఏర్పాటు చేసిన భోజన శాల, ఏసీ ఆడిటోరియం, గ్రంథాలయం, ఆటి జం సెంటర్‌, ఏఐ, రోబోటిక్స్‌ ల్యాబ్‌లను ప్రారంభించారు. పొట్టి శ్రీరాములు జంక్షన్‌ నుంచి అరసవల్లి జంక్షన్‌ వరకు హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌లో చేపట్టిన రహదారి మధ్య మీడియన్‌ నిర్మాణ పనులను ప్రారంభించారు. సోడా లేఅవుట్‌లో సీసీ రోడ్డు, వుడా లేఅవుట్‌లో బీటీ రోడ్డు, శాంతినగర్‌ కాలనీలో సీసీ రోడ్డును ప్రారంభిం చారు. రిమ్స్‌ ప్రాంగణంలో జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేఫ్‌ను ప్రారంభించారు. హడ్కో కాలనీ ఎలిమెంటరీ స్కూల్‌ వద్ద రూ.10 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డైన్రేజీ పనులకు శంకు స్థాపన చేశారు. పుణ్యపువీధిలో రూ.32.4 లక్షలతో, డీసీసీబీ కాలనీలో రూ.49.9 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, డైన్రేజీ లను ప్రారంభించారు. రూ.కోటి అంచనా వ్యయంతో నిర్మించిన డీసీఎంఎస్‌ కల్యాణ మండపాన్ని ప్రారం భించారు. పలువురు నేతలు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 09 , 2026 | 11:49 PM