Share News

పెట్రోల్‌ బంకులో కొలతల్లో కిరికిరి

ABN , Publish Date - Mar 28 , 2026 | 12:01 AM

పట్టణంలోని ఓ పెట్రోల్‌ బంకులో కొలతులు తక్కువగా చేస్తున్నారని బాఽదితులు ఆందోళన వ్యక్తం చేశారు.

పెట్రోల్‌ బంకులో కొలతల్లో కిరికిరి

  • ఆందోళన చేసిన బాధితులు

నరసన్నపేట, మార్చి 27(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఓ పెట్రోల్‌ బంకులో కొలతులు తక్కువగా చేస్తున్నారని బాఽదితులు ఆందోళన వ్యక్తం చేశారు. మండల పరిధి కరగాం పంచాయతీ అంపలాం గ్రామానికి చెందిన కొందరు శుక్రవారం ఉదయం రూ.1300 డీజిల్‌ కారులో వేయించుకుని విశాఖ వెళ్తుండగా.. శ్రీకాకుళం చేరేసరికి రిజర్వుకు వచ్చేయడంతో అనుమానంతో అక్కడ చెక్‌ చేయగా ఆయిల్‌ లేదని బాధితులు.. తిరిగి శుక్రవారం రాత్రి బంకు వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. దీంతో బంకు యాజమాని పోలీసులు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ-2 శేఖరరావు అక్కడ చేరుకొని బాధితులతో మాట్లాడి శాంతింపజేశారు. శాఖపరమైన చర్యలకు సివిల్‌ సప్లై, తూనికలు, కొలతల అధికారులు ఫిర్యాదు చేయాలన్నారు. బంకు యాజమాని తూనికల్లో మోసం చేయడంతో పాటు దుర్భాషలాడినట్టు బాధితులు చెబుతున్నారు. దీనిపై శాఖపరంగా చర్యలు తీసుకోవాలని బాధితులు బంకు వద్ద ఆందోళన చేపట్టారు. ఇదిలావుంటే గతంలో పలుమార్లు ఇదే బంకులో కొలతల్లో తేడా వచ్చిందంటూ పలువురు బాధితులు ఆందోళన చేపట్టారు.

Updated Date - Mar 28 , 2026 | 12:01 AM