Share News

టీడీపీ కోసం పనిచేసే వారికి భవిష్యత్‌

ABN , Publish Date - Jul 17 , 2026 | 12:00 AM

టీడీపీ బలోపేతా నికి పనిచేసే ప్రతి కార్యకర్తకు భవిష్యత్‌ ఉంటుందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు.

 టీడీపీ కోసం పనిచేసే వారికి భవిష్యత్‌
మాట్లాడుతున్న కలిశెట్టి అప్పలనాయుడు:

రణస్థలం, జూలై 16 (ఆంధ్రజ్యోతి): టీడీపీ బలోపేతా నికి పనిచేసే ప్రతి కార్యకర్తకు భవిష్యత్‌ ఉంటుందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. గురువారం రణస్థలంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఎచ్చెర్ల నియోజకవర్గం టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వ హించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ చౌదరి అవినాష్‌, కూటమి నాయకులు లంక శ్యామలరావు, డీజీఎం ఆనందరావు, పిషిని జగన్నాఽథంనాయుడు, కనకా రావు, బాలబొమ్మన వెంకటేశ్వరరావు, తోటయ్యదొర, ముక్కు ఆదినారాయణ, దుమ్ముఅశోక్‌, దన్నాన మహేష్‌, బాలిశ్రీను పాల్గొన్నారు. కాగా ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించేందుకు ప్రజా దర్బార్‌ నిర్వహిస్తున్నట్లు ఎంపీ అప్పలనాయుడు తెలిపారు. క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్‌ కార్యక్రమం నిర్వహించారు.

Updated Date - Jul 17 , 2026 | 12:00 AM