‘ఉపాధి’ పథకంపై రచ్చబండ
ABN , Publish Date - Feb 10 , 2026 | 11:30 PM
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్రామీణ పేదలకు తీరని అన్యాయం చేసిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేడీ శీలం విమ ర్శించారు.
అరసవల్లి, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్రామీణ పేదలకు తీరని అన్యాయం చేసిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేడీ శీలం విమ ర్శించారు. మంగళవారం స్థానిక ఇందిరా విజ్ఞాన్ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర చర్యలను నిరసిస్తూ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రతి జిల్లా లో రెండు చోట్ల రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తున్నా రన్నారు. ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా నిరంకుశత్వంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఆరోపిం చారు. రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావా లని కోరుకుంటున్నారు. పార్టీని గ్రామస్థాయి నుంచి సంస్థా గతంగా పునర్నిర్మాణం చేయాల్సి ఉందని, ఆ దిశగా చర్యలు ప్రారంభించామన్నారు. ఉద్దానంలో కొబ్బరికి తెల్ల దోమ తెగులు సోకడంతో కొబ్బరి రైతులు తీవ్రంగా నష్టపోతు న్నారని వారిని ఆదుకోవాలన్నారు. త్వరలో జిల్లాకు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల రానున్నారని, ఆ కార్యక్ర మాన్ని విజయ వంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి డా.కిల్లి కృపారాణి, పీసీసీ ఉపాధ్యక్షుడు వెంకటేష్, డీసీసీ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు, రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు కామన ప్రభాకరరావు, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పూడి కిరణ్‌కుమార్, నగర పార్టీ అధ్యక్షుడు రెల్ల సురేష్, సీనియర్ నేతలు పేడాడ పరమేశ్వరరావు, అంబటి కృష్ణారావు, తెంబూరు మధుసూదనరావు పాల్గొన్నారు.