Share News

వైసీపీ అరాచకాలకు చరమగీతం పాడాలి

ABN , Publish Date - Jul 13 , 2026 | 11:39 PM

వైసీపీ నాయకుల అరాచక రాజకీయాలకు చరమ గీతం పాడాలని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు.

వైసీపీ అరాచకాలకు చరమగీతం పాడాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే గొండు శంకర్‌

శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్‌

అరసవల్లి, జూలై 13(ఆంధ్ర జ్యోతి): వైసీపీ నాయకుల అరాచక రాజకీయాలకు చరమ గీతం పాడాలని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. సోమవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మా ట్లాడుతూ.. వైసీపీ నాయకుల అహంకారధోరణి, బాధ్యతారాహి త్యానికి పలాస సంఘటనే ఒక ఉదాహరణ అని అన్నారు. బాధితులకు అండగా ఉండాల్సిన నాయకులు, సమాజానికి ప్రమాదకరంగా తయా రయ్యారని విమర్శించారు. ప్రమాదం జరిగిన తరువాత బాధితులపై కనీస మానవత్వం చూపలేదు సరికదా, బాధితులకు మతిస్థిమితం లేదని అనడం దారుణమన్నారు. పోలీసులు నిష్పక్ష పాతంగా విచారణ చేపట్టి నింది తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సామాన్యులకు ఎక్కడ అన్యాయం జరిగినా వారికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుం దన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తమ్మినేని సుజాత, టీడీపీ జిల్లా అధ్యక్షుడు మొదలవలస రమేష్‌, ఉపాధ్య క్షుడు గొండు వెంకటరమణ, స్టేట్‌ డైరెక్టర్‌ పీఎం జేబాబు, తెలుగుయువత అధ్యక్షుడు రెడ్డి గిరిజా శంకర్‌, అంధవరపు సంతోష్‌, పిరియా మాధవి తదితరులు పాల్గొన్నారు.

టిడ్కో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

అరసవల్లి, జూలై 13(ఆంధ్రజ్యోతి): నగర పాలక సంస్థ పరిధిలో టిడ్కో ఇళ్ల కోసం ముందు గా సొమ్ములు చెల్లించి, ఇళ్లు రాక తీవ్ర ఇబ్బం దులు పడుతున్న 40 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే గొండు శంకర్‌ సోమవారం చెక్కులను పంపిణీ చేశారు. నగరంలోని లబ్ధిదారులకు రూ.10,50,91,000లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. మిగిలిన వారికి త్వరలో అందిస్తా మన్నారు. కార్యక్రమంలో కమిషనర్‌ శ్రవణ్‌ కుమార్‌, పట్టణ టీడీపీ అధ్యక్షుడు పాండ్రంకి శంకర్‌, ఎంహెచ్‌వో డా.సుధీర్‌ కుమార్‌ , యూనియన్‌ బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు..

పేద ప్రజల ఆరోగ్య భద్రతకు సీఎంఆర్‌ఎఫ్‌ రక్ష అని ఎమ్మెల్యే గొండు శంకర్‌ పేర్కొన్నారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో 8 మంది లబ్ధిదారులకు రూ.15,10,270 విలువైన చెక్కులను అందజేశారు.

Updated Date - Jul 13 , 2026 | 11:39 PM