సివిల్స్‌లో రైతుబిడ్డ సత్తా
ABN , Publish Date - Mar 06 , 2026 | 11:32 PM
All India rank 463rd in Civil Services జి.సిగడాం మండలం నడిమివలస గ్రామానికి చెందిన సౌరోతు రాము సివిల్స్‌లో సత్తా చాటారు. ఆలిండియాలో 463వ ర్యాంకు సాధించారు. రాముది సాధారణ రైతు కుటుంబం.
సౌరోతు రాముకు ఆలిండియా 463వ ర్యాంక్
జి.సిగడాం, మార్చి 6(ఆంధ్రజ్యోతి): జి.సిగడాం మండలం నడిమివలస గ్రామానికి చెందిన సౌరోతు రాము సివిల్స్‌లో సత్తా చాటారు. ఆలిండియాలో 463వ ర్యాంకు సాధించారు. రాముది సాధారణ రైతు కుటుంబం. తండ్రి అసిరినాయుడు కొన్నాళ్ల కిందట మృతి చెందారు. తల్లి లక్ష్మి వ్యవసాయ పనులు చేస్తూ కుమారుడిని చదివించింది. రాము జి.సిగడాం ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదివారు. వరంగల్ నిట్‌లో ఐఐటీ పూర్తి చేశారు. విశాఖపట్నం పోర్టు కార్ల కంపెనీలో 11 నెలలపాటు విధులు నిర్వహించారు. ఎలాగైనా అనుకున్నది సాధించాలనే లక్ష్యంతో ఉద్యోగాన్ని విడిచిపెట్టి సొంతంగా సివిల్స్‌కు సిద్ధమయ్యారు. మొదటి ప్రయత్నంలో ఫలితం లేకపోయినా నిరాశ చెందకుండా రెండో ప్రయత్నంలో విజయం సాధించారు. జనవరిలో విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో ప్రతిభ చూపి.. డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికయ్యారు. తాజాగా సివిల్స్‌లో కూడా సత్తా చాటడంతో తల్లి, కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.