మృతుల కుటుంబాలను ఆదుకోవాలి
ABN , Publish Date - Sep 28 , 2026 | 11:52 PM
టెక్కలి సమీపంలో రైలు ప్రమాదంలో ఇటీవల మృతిచెందిన గిరిజన కుటుంబాలను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ పోరాట సమితి అధ్యక్షుడు టి.సూర్యం, దళిత చైతన్య వేదిక అధ్యక్షుడు బసవల గోవిందరావు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.
టెక్కలి, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): టెక్కలి సమీపంలో రైలు ప్రమాదంలో ఇటీవల మృతిచెందిన గిరిజన కుటుంబాలను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ పోరాట సమితి అధ్యక్షుడు టి.సూర్యం, దళిత చైతన్య వేదిక అధ్యక్షుడు బసవల గోవిందరావు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. సోమవారం టెక్కలి ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి సబ్‌కలెక్టరేట్ వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వ హించారు. కార్యక్రమంలో సంఘ నాయ కులు గేదెల శ్రీను, లక్ష్మీపురం రామచం ద్రుడు, జగ్గారావు, జె.శ్రీనివాస్ పాల్గొన్నారు.