కన్నులపండువగా జగన్నాథుని నేత్రోత్సవం
ABN , Publish Date - Jul 14 , 2026 | 11:57 PM
స్థానిక పెద్దబ్రాహ్మణవీధిలో గల జగన్నాథ ఆలయంలో మంగళవారం స్వామి నేత్రోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. 14రోజుల పాటు స్వామివారిని ఉక్కపోతలో ఉంచి అనంతరం బయటకు తెచ్చి.. నేత్ర దర్శనం కల్పించారు. జగన్నాథ, లక్ష్మీదేవిల కల్యాణం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ దేవదాయ శాఖ ఈవో టి.మనస్విని ఆధ్వర్యంలో నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
టెక్కలి, జూలై 14(ఆంధ్రజ్యోతి): స్థానిక పెద్దబ్రాహ్మణవీధిలో గల జగన్నాథ ఆలయంలో మంగళవారం స్వామి నేత్రోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. 14రోజుల పాటు స్వామివారిని ఉక్కపోతలో ఉంచి అనంతరం బయటకు తెచ్చి.. నేత్ర దర్శనం కల్పించారు. జగన్నాథ, లక్ష్మీదేవిల కల్యాణం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ దేవదాయ శాఖ ఈవో టి.మనస్విని ఆధ్వర్యంలో నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
అధికారులతో సమీక్ష
ఈనెల 16 నుంచి 24 వరకు జరగనున్న జగన్నాథ రథయాత్ర ఏర్పాట్లపై మంగళవారం రాత్రి అధికారులు పరిశీలించారు. దేవదాయ శాఖ ఈవో టి.మనస్విని, సీఐ ఎ.విజయ్‌కుమార్, ఎస్‌ఐ రాము, సిబ్బంది, స్థానికులతో కలిసి యాత్ర నిర్వహణపై చర్చించారు. జగన్నాథస్వామి ఆలయం నుంచి విగ్రహాలను రథంపై గుండిచా మందిరానికి తరలించే ఏర్పాట్లు, రథం లాగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల సమీక్షించారు. యాత్ర కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులు నిర్ణయించారు.
రేపటి నుంచి రథయాత్ర
నందిగాం, జూలై 14(ఆంధ్రజ్యోతి): పెంటూరులో కొలువై ఉన్న మహాలక్ష్మి, గోదాదేవి సమేత వేంకటేశ్వర ఆలయంలో గురువారం నుంచి జగన్నాథ రథయాత్ర నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్టట ఆలయ ధర్మకర్త బొడ్డ జనార్దనరావు, అర్చకులు నర్శింహాచార్యులు, రాజగోపాలాచార్యులు తెలిపారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి జగన్నాథస్వామి అష్టోత్తర శతనామార్చన, విశేషపూజ, హారతి తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు.
ఫ నరసన్నపేట, జూలై 14(ఆంధ్రజ్యోతి): జగన్నాథ స్వామి రథయాత్రలో భాగంగా గురువారం నుంచి పది రోజులు పాటు పెద్దపేట వద్ద ఉత్సవాలు జరుగుతాయని నిర్వాహకులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం సాయంత్రం ఏడు గంటలకు సత్యవరం గ్రామం నుంచి రథయాత్ర ప్రారంభమై నరసన్నపేట పెద్దపేట చేరుతుందని తెలిపారు. గుడించాలో పది రోజుల పాటు స్వామి వివిధ అవతారాల్లో దర్శనమిస్తారని తెలిపారు. ఆషాఢ మాసం సందర్భంగా బుధవారం నుంచి దేవాలయాల్లో ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.