Share News

అటకెక్కుతున్న రైతుబజారు ఏర్పాటు

ABN , Publish Date - Nov 14 , 2026 | 12:28 AM

ఇచ్ఛాపురంలో రైతుబజారు ఏర్పాటు అటకెక్కుతోంది. దీంతో రైతులు, వ్యాపారులు రోడ్లకు ఇరువైపులా, జంక్షన్లలో కూరగాయలు విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యంలో పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు సరైన కూరగాయల మార్కెట్‌ లేకుండా పోతోంది.

అటకెక్కుతున్న రైతుబజారు ఏర్పాటు
ఇచ్ఛాపురంలో ఇరుగ్గా ఉన్న డైలీమార్కెట్‌:

ఇచ్ఛాపురం, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఇచ్ఛాపురంలో రైతుబజారు ఏర్పాటు అటకెక్కుతోంది. దీంతో రైతులు, వ్యాపారులు రోడ్లకు ఇరువైపులా, జంక్షన్లలో కూరగాయలు విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యంలో పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు సరైన కూరగాయల మార్కెట్‌ లేకుండా పోతోంది.

ఇచ్ఛాపురంలో 2019 ఆగస్టు 8న అప్పటి సీఎం జగన్‌ శాసనసభలో రైతుబజారు ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటిం చారు. ఇందుకుగాను రూ.50 లక్షలు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఆ ప్రకటన కార్యరూపం దాల్చలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా రైతుబజారు ఏర్పాటుకు సంబంధించి ఎటు వంటి కార్యాచరణ చేపట్టలేదని స్థానికులు వాపోతున్నారు. గతంలో టీడీపీ హయాంలో రైతుబజారు నిర్మాణానికి అడుగులు పడ్డాయి. ఇంతలో ఎన్నికలు రావడం, అధికార మార్పిడి వల్ల ఆ ప్రక్రియ ముందుకుసాగలేదు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రైతుబజారు ఏర్పాటుపై ప్రకటనచేసినా అనువైన ప్రాంతాలు ఉన్నా గుర్తించ డంలో అప్పటి ప్రభుత్వం విఫలమయ్యిందని పలువురు వాపోతు న్నారు. దీంతో రైతులు, వ్యాపారులకు ఇబ్బందులు తప్పలేదు.

ఇచ్ఛాపురంలో రైతుబజారు లేకపోవడంతో రహదారులపైనే కూరగా యల విక్రయాలు జరుగుతున్నాయి. మైదానం, ఉద్దానం, తీరప్రాంతం ఉండడంతో రైతులు వ్యవసాయోత్పత్తులు, మత్స్య కారులు చేపలను తెచ్చి విక్రయిస్తుంటారు. ఒడిశా వాసులు సైతం అటవీఉత్పత్తులు తీసు కొచ్చి అమ్ముతుంటారు.వీరికి సరైన మార్కెటింగ్‌ సదుపాయం లేకపో వడంతో దళారుల బారిన పడుతున్నారు. మరోవైపు రహదారులపై షాపులు వెలుస్తుండ డంతో ట్రాఫిక్‌కు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవు తున్నాయి. బస్టాండ్‌ ప్రాంగణంలో కూరగాయల దుకాణాల ఉండడంతో వాహనాలు కూడా పార్కింగ్‌కు ఇబ్బందులు తప్పడం లేదు.

Updated Date - Nov 14 , 2026 | 12:28 AM