విద్యుత్ ప్లాంట్ ఏర్పాటును సహించేదిలేదు
ABN , Publish Date - Jan 05 , 2026 | 11:26 PM
విద్యు త్ ప్లాంట్ ఏర్పాటును సహించేది లేదని గిరి జనులు తేల్చి చెప్పారు.
అధికారులను అడ్డుకున్న గిరిజనులు
సరుబుజ్జిలి, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): విద్యు త్ ప్లాంట్ ఏర్పాటును సహించేది లేదని గిరి జనులు తేల్చి చెప్పారు. మండలంలోని చిగురు వలస పంచాయతీ పరిధి వెన్నెల వలస గ్రామం లోని ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేయనున్న సోలార్ పవర్‌ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి స్థల పరిశీలనకు సోమవారం అధికారులు రాగా స్థానిక గిరిజనులు అడ్డుకున్నారు. డిప్యూటీ తహ సీల్దార్ జగదీశ్వరరావు, ఆర్‌ఐ భవానీ ఆధ్వర్యంలో రెవన్యూ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ఆ సమయంలో వెన్నెలవలసకి చెందిన కొందరు గిరిజనులు గ్రామంలో ముందుగా దండోరా వే యించి గ్రామసభ నిర్వహించి అందరి అంగీ కారం తీసుకున్న తర్వాతే సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అంత వరకు ప్లాంట్ పనులకు అంగీకరించమని స్పష్టం చేస్తూ వెన్నెలవలస నుంచి బసవ మామిడి వలస వెళ్లే రహదారిపై ముళ్లకంపలు వేసి కొంత సేపు రెవెన్యూ సిబ్బందిని అడ్డుకు న్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సరుబుజ్జిలి ఎస్‌ఐ బి.హైమవతి అక్కడికి చేరు కొని గిరిజను లతో మాట్లాడి వారికి నచ్చజెప్పారు. అనంతరం రెవెన్యూ అధికారులు దండోరా వేయించి గ్రామ సభ నిర్వహిస్తామని గిరిజనులకు హామీని వ్వ డంతో వారు శాంతించారు. దీనితో అధికారులు అక్కడ నుంచి వెనుదిరిగారు.