Share News

పర్యావరణాన్ని పరిరక్షించాలి

ABN , Publish Date - Jun 01 , 2026 | 11:50 PM

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రకృతి సంరక్షణ ద్వారానే భావితరాలకు మెరుగైన భవిష్యత్‌ను అందించగల మని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. సోమవారం నిమ్మాడ తన క్యాం పు కార్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని ఏపీ పీసీబీ శ్రీకాకుళం ప్రాంతీయకార్యాలయంలో ఆధ్వర్యంలో ఈనెల ఐదోతేదీ వరకు నిర్వహిం చనున్న పర్యావరణ అవగాహన కార్యక్రమాలకు సంబందించిన గోడపత్రికను ఆవి ష్కరించారు.

 పర్యావరణాన్ని పరిరక్షించాలి
పర్యావరణ పరిరక్షణ పోస్టర్లను ఆవిష్కరిస్తున్న అచ్చెన్నాయుడు

కోటబొమ్మాళి, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రకృతి సంరక్షణ ద్వారానే భావితరాలకు మెరుగైన భవిష్యత్‌ను అందించగల మని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. సోమవారం నిమ్మాడ తన క్యాం పు కార్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని ఏపీ పీసీబీ శ్రీకాకుళం ప్రాంతీయకార్యాలయంలో ఆధ్వర్యంలో ఈనెల ఐదోతేదీ వరకు నిర్వహిం చనున్న పర్యావరణ అవగాహన కార్యక్రమాలకు సంబందించిన గోడపత్రికను ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీ పీసీబీ చైర్మన్‌ పి.కృష్ణయ్య ఆదేశాల మేరకు జిల్లాలో వ్యర్థాలతో సంపద ప్రదర్శనలు, జ్యూట్‌ బ్యాగుల పంపిణీ, మొక్కల నాటడం, నాగావళి నది శుభ్రత కార్యక్ర మాలు, మానవహారం, వీధి నాటికలు, అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నామని జిల్లా పర్యావరణ ఇంజనీర్‌ కరుణశ్రీ మంత్రికి వివరించారు. కార్యక్రమంలో ఆర్డీవో కృష్ణమూర్తి పాల్గొన్నారు.

Updated Date - Jun 01 , 2026 | 11:50 PM