Share News

ఆక్రమణ భూములను స్వాధీనం చేసుకోవాలి

ABN , Publish Date - Jan 06 , 2026 | 11:13 PM

పెద్దబొడ్డపాడు పంచాయతీ పరిధిలోని తోటపల్లి వద్ద ఉన్న సుమారు 84 ఎకరాల కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల భూములు ఆక్రమణకు గురవుతున్నాయని, వాటిని స్వాధీనం చేసుకొని బోర్డు లు ఏర్పాటు చేయాలని సర్పంచ్‌ టి.ఢిల్లీరావు కోరారు.

ఆక్రమణ  భూములను స్వాధీనం చేసుకోవాలి
మాట్లాడుతున్న ఎంపీపీ నీలవేణి

- మండల సమావేశంలో కోరిన సభ్యులు

- ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై నిరసన

వజ్రపుకొత్తూరు, జనవరి 6 (ఆంధ్రజ్యోతి ): పెద్దబొడ్డపాడు పంచాయతీ పరిధిలోని తోటపల్లి వద్ద ఉన్న సుమారు 84 ఎకరాల కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల భూములు ఆక్రమణకు గురవుతున్నాయని, వాటిని స్వాధీనం చేసుకొని బోర్డు లు ఏర్పాటు చేయాలని సర్పంచ్‌ టి.ఢిల్లీరావు కోరారు. ఎంపీపీ ఉప్పర పల్లి నీలవేణి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా పెద్దబొడ్డపాడు సర్పంచ్‌ ఢిల్లీరావు మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నా ఫారెస్టు, రెవెన్యూ అధికారులు పట్టించు కోవడం లేదని ఆరోపించారు. పెద్దల చేతుల్లో ఉన్న భూములను స్వాధీనం చేసుకొని పేదలకు పంచాలని ఆయన డిమాండ్‌ చేశారు. అయితే సభకు ఫారెస్టు అధికారులు గైర్హాజరు కావడంపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడునెలలకు ఒకసారి జరిగే సభకు కీలక అధికారులు డుమ్మా కొట్టడంపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఎంపీడీవో ఎన్‌ రమేష్‌నా యుడు తెలిపారు. రాజాం పంచాయతీ ధర్మపురంలో విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతుందని, వెంటనే రెవెన్యూ అధికారులు ఆ భూమిని స్వాధీనం చేసుకొని బోర్డులు ఏర్పాటు చేయాలని సర్పంచ్‌ పిట్ట గీతారాణి కోరా రు. దీనిపై ఎంపీడీవో స్పందిస్తూ.. ఆక్రమణలకు సంబంధించిన వివరాలను అందిస్తే వాటిని సంబంధింత శాఖాలకు అందిస్తానని అన్నారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్చడంపై సభ్యులు నిరసన వ్యక్తం చేశా రు. మండల కోఆప్షన్‌ మరడ భాస్కరరెడ్డి మాట్లాడుతూ.. అనంతగిరి పంచా యతీలో అంగన్‌వాడీ భవన నిర్మాణాలు చేపట్టకపోవడంతో పిల్లలు ఇబ్బందు లు పడుతున్నారని, వెంటనే అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. బెండి గేటు ప్లైఓవర్‌పై రాత్రివేళలో విద్యుత్‌ దీపాలు వెలగకపోవడంతో ప్రయాణి కులు ఇబ్బందులు పడుతున్నట్లు సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమావే శంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ కణితి సురేష్‌, వైద్యాధికారి రిచర్డ్‌బూన్‌, మండల ప్రత్యేకాధికారి, ఏడీ పి.చంద్రశేఖర్‌, వ్యవసాయాధికారి బమ్మిడి ధనుంజయ, పశువైద్యాధికారి మెట్ట పాపారావు, వైస్‌ ఎంపీపీ రాజు, శ్రావణి, ప్రత్యేక ఆహ్వానితుడు ఉదయకుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2026 | 11:13 PM