నగరాభివృద్ధి కల త్వరలో సాకారం
ABN , Publish Date - Nov 19 , 2026 | 12:10 AM
నగర ప్రజలు 16 ఏళ్లుగా ఎదురు చూ స్తున్న స్థానిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నగరాభివృద్ధిపై వారి కలలు త్వరలో సాకారం కానున్నాయని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.
కూటమి మేయర్ అభ్యర్థిని గెలిపించండి
ఎమ్మెల్యే గొండు శంకర్
శ్రీకాకుళం అర్బన్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): నగర ప్రజలు 16 ఏళ్లుగా ఎదురు చూ స్తున్న స్థానిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నగరాభివృద్ధిపై వారి కలలు త్వరలో సాకారం కానున్నాయని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. ఈ మేరకు బుధవారం టీడీపీ జిల్లా కార్యాల యంలో విలేకరులతో మాట్లాడుతూ.. కూటమి పార్టీల తరపున పోటీ చేస్తున్న మేయర్ అభ్యరి దానేటి రాధారాణిని గెలిపించాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 34 శాతా నికి తగ్గించగా కూటమి ప్రభుత్వం 40 శాతానికి పైగా రిజర్వేషన్లు కల్పించి బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. నగరాభివృద్ధికి ఇప్పటికే కోట్లాది రూపాయలు కేటాయించామన్నారు. రానున్న మూడేళ్లలో రూ.325 కోట్లు పనులు జరగను న్నాయన్నారు. ఇప్పటికే రూ.103 కోట్ల పనులు జరుగుతున్నాయన్నారు. సెంటిమెంట్ రాజకీయా లతో ప్రజలను ప్రభావితం చేయాలని చూస్తే వారే తగిన సమాధానం చెబుతారన్నారు. సమా వేశంలో మేయర్ అభ్యర్థి దానేటి రాధారాణి, టీడీపీ, బీజేపీ జిల్లా అధ్యక్షులు మొదలవలస రమేష్, తేజేశ్వరరావు, కూటమి నేతలు పైడిశెట్టి జయంతి, మాధవి, రవీంద్ర, పీఎంజేబాబు తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ కార్పొరేటర్ల అభ్యర్థులకు బీఫారాల పంపిణీ
శ్రీకాకుళం, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి 60 వార్డుల్లో టీడీపీ, బీజేపీ, జన సేనలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇందులో భాగంగా 46 వార్డులకు సంబం ధించి టీడీపీ కార్పొరేటర్ల అభ్యర్థులకు బుధ వారం రాత్రి ఎమ్మెల్యే గొండు శంకర్ బీఫారా లను అందజేశారు. పార్టీ నగర అధ్యక్షుడు పాండ్రంకి శంకర్‌తో పాటు పలువురు అభ్య ర్థులు బీఫారాలు అందుకున్నారు. జనసేన నాయకుడు డా.దానేటి శ్రీధర్, టీడీపీ నేత పీఎంజే బాబు తదితరులు పాల్గొన్నారు.