Share News

నెరవేరనున్న నేరడి బ్యారేజీ కల

ABN , Publish Date - Jul 24 , 2026 | 12:13 AM

దశాబ్దాలుగా సవాలుగా మిగిలిపోయిన నేరడి బ్యారేజీ నిర్మాణం కల నెరవేరనుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ తెలిపారు. బ్యారేజీ నిర్మాణానికి సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో క్యాబినెట్‌ రూ.641కోట్ల మంజూ రుకు ఆమోదం తెలియజేయడంపై హర్షం వ్యక్తంచేశారు. ఈమేరకు శ్రీకాకుళంలోని ఏడురోడ్ల జంక్షన్‌ వద్ద గురువారం బాణసంచాకాల్చి సంబరాలు నిర్వహించారు.

 నెరవేరనున్న నేరడి బ్యారేజీ కల
చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకంచేస్తున్న ఎమ్మెల్యే శంకర్‌:

అరసవల్లి, జూలై 23(ఆంధ్రజ్యోతి): దశాబ్దాలుగా సవాలుగా మిగిలిపోయిన నేరడి బ్యారేజీ నిర్మాణం కల నెరవేరనుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ తెలిపారు. బ్యారేజీ నిర్మాణానికి సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో క్యాబినెట్‌ రూ.641కోట్ల మంజూ రుకు ఆమోదం తెలియజేయడంపై హర్షం వ్యక్తంచేశారు. ఈమేరకు శ్రీకాకుళంలోని ఏడురోడ్ల జంక్షన్‌ వద్ద గురువారం బాణసంచాకాల్చి సంబరాలు నిర్వహించారు. ఎన్టీఆర్‌, ఎర్రన్నాయుడి విగ్రహాలకు పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిత్రపటా లకు క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బ్యారేజీ నిర్మాణం పూర్తయితే జిల్లాలో 2.5లక్షల ఎకరాలకు సాగునీరందడంతోపాటు తాగునీటి సమస్యల తొలగిపోతుందని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మాదారపు వెంకటేష్‌, పీఎంజే బాబు, ఎస్వీ రమణ మాదిగ, నగర పార్టీ అధ్యక్షుడు పాండ్రంకి శంకర్‌, కోరాడ హరగోపాల్‌, అంధవరపు ప్రసాద్‌, డి.జ్యోతి భాస్కర్‌, ఉంగటి వెంకటరమణ, రాయి అర్జున్‌, కవ్వాడి సుశీల, పిరియా మాధవి పాల్గొన్నారు.

Updated Date - Jul 24 , 2026 | 12:13 AM