Share News

బకాయిలు రావు.. బాధలు తీరవు!

ABN , Publish Date - Mar 28 , 2026 | 12:03 AM

Unpaid cess to libraries విజ్ఞానాన్ని పంచే గ్రంఽథాయాలు నిధులు లేక అభివృద్ధికి దూరమవుతున్నాయి. స్థానిక సంస్థల నుంచి రావాల్సిన సెస్‌ బకాయిలు విడుదల కాక కనీస సౌకర్యాలు కొరవడుతున్నాయి. సిబ్బందికి జీతాలతోపాటు.. పదవీ విరమణ చెందిన వారికి సకాలంలో పెన్షన్‌లు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొంది.

బకాయిలు రావు.. బాధలు తీరవు!
శ్రీకాకుళంలోని జిల్లా గ్రంథాలయం

  • గ్రంఽథాలయాలకు జమకాని సెస్‌

  • జీతాలు ఇవ్వలేని స్థితిలో అధికారులు

  • నాలుగు నెలలుగా నిలిచిన పెన్షన్లు

  • ఆందోళనలో ఉద్యోగులు, పెన్షన్‌దారులు

  • నందిగాం మండలం పెద్దతామరాపల్లి గ్రామానికి చెందిన తమెరి వైకుంఠరావు ఏడేళ్ల కిందట టెక్కలి శాఖ గ్రంథాలయాధికారిగా పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం జిల్లా గ్రంథాలయ పెన్షనర్ల సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గత ఏడాది డిసెంబరు నుంచి పెన్షన్‌ రాక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. పెన్షన్‌ కోసం అధికారులకు దరఖాస్తు చేయగా.. సెస్‌ రాక నిధులు లేవని చెబుతున్నారు. దీంతో తమ జీవనం ఎలా సాగించాలని అని వైకుంఠరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన లాగే జిల్లాలో 52 మందికి నాలుగు నెలలుగా పెన్షన్‌లు అందక ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ప్రభుత్వం స్పందించి పెన్షన్‌ సక్రమంగా అందించేలా చర్యలు చేపట్టాలని కోరారు.

  • టెక్కలి రూరల్‌, మార్చి 27(ఆంధ్రజ్యోతి): విజ్ఞానాన్ని పంచే గ్రంఽథాయాలు నిధులు లేక అభివృద్ధికి దూరమవుతున్నాయి. స్థానిక సంస్థల నుంచి రావాల్సిన సెస్‌ బకాయిలు విడుదల కాక కనీస సౌకర్యాలు కొరవడుతున్నాయి. సిబ్బందికి జీతాలతోపాటు.. పదవీ విరమణ చెందిన వారికి సకాలంలో పెన్షన్‌లు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొంది. దీంతో ఆయా ఉద్యోగులు, సిబ్బంది, పెన్షనర్లు ఆందోళన చెందుతున్నారు. గత మూడు, నాలుగు నెలలుగా బకాయిలు చెల్లించకపోవడంతో తమ బాధలు ఎలా తీరుతాయని వాపోతున్నారు.

  • జిల్లాలో శ్రీకాకుళంలోని జిల్లా గ్రంథాలయంతోపాటు.. 44 శాఖా గ్రంథాలయాలు ఉన్నాయి. 5 గ్రామీణ గ్రంథాలయాలు, 108 పుస్తక నిక్షిప్త కేంద్రాలు నిర్వహిస్తున్నారు. 22 మంది గ్రంథాలయ అధికారులు, 13 మంది ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఉన్నారు. 52 మంది పెన్షనర్లు ఉన్నారు. ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లతోపాటు గ్రంథాలయాల నిర్వహణకు ప్రతి నెలా రూ.40 లక్షల వరకు ఖర్చువుతోంది. స్థానిక సంస్ల్థల నెల నుంచి వసూలు చేసిన సెస్‌ నిధులనే వీటికి వినియోగిస్తారు. జిల్లావ్యాప్తంగా పంచాయతీల నుంచి ఏడాదికి రూ.5కోట్ల నిధులు రావాల్సి ఉంది. కాగా.. ఇప్పటివరకూ రూ.2కోట్లు మాత్రమే జమయ్యాయని అధికారులు చెబుతున్నారు. దీంతో మూడు నెలల నుంచి సిబ్బందికి జీతాలు అందడం లేదు. అలాగే గతేడాది డిసెంబరు నుంచి పెన్షన్‌లు రాక పెన్షన్‌దారులు ఇబ్బందులు పడుతున్నారు.

  • డిజిటల్‌ పేరుతో..

  • వైసీసీ ప్రభుత్వం డిజిటల్‌ గ్రంఽథాలయాల పేరుతో అధికంగా నిధులు ఖర్చు చేసినట్లు చూపిస్తున్నా ఎక్కడ భవనాలు నిర్మించిన పరిస్థితి లేదు. అలాగే చాలాచోట్ల గ్రంథాలయాల్లో కనీస సౌకర్యాలు లేవు. నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు పుస్తకాలు కూడా అరకొరగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం స్పందించి గ్రంథాలయాల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. తమకు వేతనాలు, పెన్షన్లు మంజూరు చేయాలని ఉద్యోగులు, పెన్షనర్లు విజ్ఞప్తి చేస్తున్నారు.

  • పెన్షనే ఆధారం

  • పెన్షన్‌పై ఆధారపడి కుటుంబాన్ని పోషిస్తున్నా. గత నాలుగు నెలలు నుంచి పెన్షన్‌ అందక.. అప్పులు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోతోంది. ఇప్పటికైనా కనికరించి పెన్షన్‌ అందజేయాలి.

  • - గుంట విశ్వేరరావు, జిల్లా గ్రంథాలయ పెన్షనర్ల సంఘం ప్రధాన కార్యదర్శి

  • సెస్‌ డబ్బులు జమకాక

  • పంచాయతీల నుంచి ప్రతి ఏడాది 5 కోట్లు నిధులు గ్రంఽథాలయాలకు జమ కావాలి. ఈ ఏడాది రూ.2కోట్లు మాత్రమే జమయ్యాయి. దీంతో జీతాలు, పెన్షన్లు సకాలంలో ఇవ్వలేకపోతున్నాం. ఈ నెలాఖరు నాటికి నిధులు జమ చేస్తామని పంచాయతీ అధికారులు చెబుతున్నారు. అవి వస్తే జీతాలు, పెన్షన్లు అందజేస్తాం.

  • - శంకరరావు, జిల్లా గ్రంథాలయ సెక్రటరీ, శ్రీకాకుళం

Updated Date - Mar 28 , 2026 | 12:03 AM