అత్తకి తలకొరివిపెట్టిన కోడలు
ABN , Publish Date - Apr 20 , 2026 | 12:51 AM
షలంత్రి గ్రామంలో అత్త చితికి కోడలు తలకొరివి పెట్టిన ఘటన ఆదివారం సంభించింది. బత్తిని ఎర్రమ్మ (75) భర్త, ఇద్దరు కుమారులుండగా వారు ఇటీవల మృతి చెందారు.
సరుబుజ్జిలి, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): షలంత్రి గ్రామంలో అత్త చితికి కోడలు తలకొరివి పెట్టిన ఘటన ఆదివారం సంభించింది. బత్తిని ఎర్రమ్మ (75) భర్త, ఇద్దరు కుమారులుండగా వారు ఇటీవల మృతి చెందారు. దీంతో ఎర్రమ్మ కోడలు కళావతి ఒక ఇంటిలోనే నివాసం ఉం టున్నారు. కొంతకాలంగా ఎర్రమ్మ అనారోగ్యంతో బాధపడుతూ మంచం పట్టింది. ఆదివారం ఉదయం ఆమె మృతి చెందగా కుమారులెవరూ లేకపోవడంతో కోడలు కళావతి అంత్య క్రియలు చేసింది. ఈ ఘటన గ్రామస్థులను కంటతడిపెట్టించింది.