దోషులను కఠినంగా శిక్షించాలి
ABN , Publish Date - Apr 29 , 2026 | 12:33 AM
చిత్తూరు జిల్లా వి.కోట మండల ఆంధ్రజ్యోతి సీనియర్ రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని పలు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు.
కాశీబుగ్గ డీఎస్పీకి వినతిపత్రం అందించిన జర్నలిస్టులు
చిత్తూరు జిల్లా ఆంధ్రజ్యోతి విలేకరి హత్యపై నిరసన
కాశీబుగ్గ/పలాస, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా వి.కోట మండల ఆంధ్రజ్యోతి సీనియర్ రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని పలు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కాశీబుగ్గలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద మంగళవారం జర్నలిస్టు సంఘాల నాయ కులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జగ న్మోహన్‌రెడ్డి అమర్‌రహే, హత్యపై తక్షణమే ప్రభు త్వం స్పందించి నిందితులను కఠినంగా శిక్షించా లని నినాదాలు చేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి కాశీబుగ్గ డీఎస్పీ టి.భవానికి వినతిపత్రం అందిం చారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. జర్నలిస్టులపై దాడులు, హత్యలు పెరిగిపోతున్నా యని ప్రభుత్వం స్పందించి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జర్నలిస్టులు డి.మహారణ, సీహెచ్ జగదీస్, సీహెచ్ నేతాజీ, ఎస్.జయంత్, గోరు భా స్కరరావు, నారాయణరావు, చంద్రరావు, హరినారాయ ణ, రూప్‌సుందర్, భుజంగ రావు, సత్యం రవీంద్ర, అశో క్‌కుమార్, విశ్వేశ్వరరావు, చిట్టి, రవిశంకర్, రవి, కె.కృష్ణ, భీమారావు, రమేష్, మనోజ్, అంజి, సురో, మో హన్, మేఘన పాల్గొన్నారు.
టెక్కలిలో..
టెక్కలిరూరల్, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా వి.కోట ఆంధ్రజ్యోతి విలేకరు జగన్మోహన్‌రెడ్డిపై దాడి చేసి హత్య చేసినవారిని కఠినంగా శిక్షించాలని వివిధ జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. మంగళవారం రాత్రి టెక్కలిలో జర్నలిస్టు సంఘలతో పాటు టీడీపీ నాయకులు ఆధ్వర్యంలో కొవ్వత్తులు ర్యాలీ నిర్వహించారు. జర్నలిస్టులపై దా డులు చేయడం సరికాదన్నారు. దాడులకు పాల్పడి నవారిపై కఠనంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇందిమ్మ జంక్షన్ నుంచి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వ హించి నినాదాలు చేశారు. కార్యక్రమంలో కోటబొ మ్మాళి ఏఎంసీ చైర్మన్ బగాది శేషగిరావు, సతీష్, మట్ట పురుషోత్తం, ప్రసాద్‌రెడ్డి, ప్రపుపుల్లా, దళిత సంఘ నాయకులు వై.గోపి, విలేకర్లు సంఘ నాయ కులు కూన సుధా, వెంకటేష్, రమణ, ఈశ్వరరావు, కిరణ్, ప్రసాదరావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.