Share News

ఆదిత్యుని సేవలో మంత్రి అచ్చెన్న దంపతులు

ABN , Publish Date - May 05 , 2026 | 12:04 AM

ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత అరసవల్లి సూర్యనారాయణ స్వామిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దంపతులు సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఆదిత్యుని సేవలో మంత్రి అచ్చెన్న దంపతులు
మంత్రి అచ్చెన్నాయుడు దంపతులకు స్వామివారి చిత్రపటం అందిస్తున్న ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మ

అరసవల్లి, మే 4(ఆంధ్రజ్యోతి): ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత అరసవల్లి సూర్యనారాయణ స్వామిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దంపతులు సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆలయానికి వచ్చిన మంత్రి దంపతులను అర్చకులు, అధికా రులు ఆలయ మర్యాద లతో స్వాగతం పలికారు. అనంతరం వారి పేరున అర్చకులు విశేష పూజ లు చేశారు. అనంతరం అనివెట్టి మండపంలో వేద పండితులు వేదాశీ ర్వచనం చేశారు. స్వామి వారి చిత్రపటం, ప్రసాదా లను ప్రధాన అర్చ కుడు ఇప్పిలి శంకర శర్మ అందించారు. అలాగే దివంగత కేంద్రమంత్రి కింజరాపు ఎర్రన్నా యుడు కుమార్తె, రాజమండ్రి సిటీ మాజీ ఎమ్మెల్యే భవాని.. కుమారుడితో కలిసి స్వామిని దర్శించుకున్నారు. సూర్యనమస్కార పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్‌, నాయకులు, అర్చకులు పాల్గొన్నారు.

Updated Date - May 05 , 2026 | 12:04 AM