బాలామణి అమ్మవారికి చల్లదనం
ABN , Publish Date - May 31 , 2026 | 11:49 PM
బి.గొనపపుట్టుగ గ్రామదేవత బాలమణి అమ్మవారికి ఆదివారం గ్రామ స్థులు చల్లదనం చేశారు.
కవిటి, మే 31(ఆంధ్రజ్యోతి): బి.గొనపపుట్టుగ గ్రామదేవత బాలమణి అమ్మవారికి ఆదివారం గ్రామ స్థులు చల్లదనం చేశారు. అమ్మవారి ప్రతిరూపాలైన గజముద్దలకు పూజలు చేసి గ్రామంలో ఊరేగింపు చేపట్టారు. మేళతాళాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో ఈ ఉత్సవాన్ని చేపట్టారు.
ఎమ్మెల్యే అశోక్ ప్రత్యేక పూజలు
కవిటి, మే 31(ఆంధ్రజ్యోతి): ఉద్దానం ఇలవేల్పు చింతామణి అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మ వారిని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ దర్శించుకుని ఉత్సవ మండపంలో అమ్మవారికి ప్రత్యే క పూజలు చేపట్టారు అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు ఆయనను దుశ్శాలువతో సత్కరించి అమ్మవారి చిత్రపటం అందించారు. పీఏసీఎస్ చైర్మన్ బాసుదేవ్ ప్రదాన్, కాళింగ కార్పొరేషన్ డైరెక్టర్ బి.చిన్న బాబు, టీడీపీ మండల అధ్యక్షుడు పి.కృష్ణారావులను సత్కరించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
ఘనంగా తులసమ్మ సంబరం
ఇచ్ఛాపురం, మే 31 (ఆంధ్రజ్యోతి): ధనరాజ తులసమ్మ తల్లి సంబరాన్ని ఆదివారం ఘనంగా నిర్వ హించారు. వేకువ జామున అమ్మవారి ఆలయం వద్ద అఖండ జ్యోతిని వెలిగించి సంబరాలను ప్రారంభించారు. అమ్మ వారి ఘటాలతో చుట్టుపక్కల గ్రామా లతో పాటు పట్టణంలోని పలు వార్డుల నుంచి ప్రజలు ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి చల్లదనం చేసి ముర్రాటలు సమర్పించారు. మొక్కులు చెల్లించు కున్నారు. అమ్మవారి ఘటాలు, పానాకాల బిందెలతో ఊరేగింపులో పాల్గొన్నారు.