నీట్ అక్రమాలపై కేంద్రానిది మొండి వైఖరి
ABN , Publish Date - Jun 27 , 2026 | 11:48 PM
నీట్ అక్రమాలపై కేంద్రం మొండి వైఖ రి అవలంబిస్తోందని, దీనివల్ల యువత తీవ్రంగా నష్టపోయారని కేంద్ర మాజీ మంత్రి డా.కిల్లి కృపారాణి అన్నారు.
కేంద్ర మాజీమంత్రి కిల్లి కృపారాణి
అరసవల్లి, జూన్ 27(ఆంధ్రజ్యోతి): నీట్ అక్రమాలపై కేంద్రం మొండి వైఖ రి అవలంబిస్తోందని, దీనివల్ల యువత తీవ్రంగా నష్టపోయారని కేంద్ర మాజీ మంత్రి డా.కిల్లి కృపారాణి అన్నారు. శనివారం ఇందిరా విజ్ఞాన భవన్‌లో యువతను మేల్కొలిపేందుకు ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ ద్వారా రాహుల్ గాంధీ ప్రసంగాన్ని ప్రదర్శించా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశం లో నిరుద్యోగం పెరిగిపో తోందని, ఇటీవల జరి గిన నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకల కార ణంగా ఎంతోమంది విద్యార్థులు మానసిక క్షోభతో ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు, యువత మేల్కొని రాజకీయాలకు అతీ తంగా పోరాడాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు, మాజీ అధ్యక్షులు పేడాడ పరమేశ్వరరావు, అంబటి కృష్ణారావు, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పూడి కిరణ్‌కుమార్, నగర అధ్యక్షుడు రెల్ల సురేష్, పలువురు నాయకులు పాల్గొన్నారు.