Share News

జనగణనను గడువులోగా పూర్తి చేయాలి

ABN , Publish Date - May 06 , 2026 | 12:09 AM

జిల్లాలో జరుగుతున్న జన గణన ప్రక్రియను నిర్దేశించిన గడువు లోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశించారు.

జనగణనను గడువులోగా పూర్తి చేయాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

శ్రీకాకుళం కలెక్టరేట్‌, మే 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో జరుగుతున్న జన గణన ప్రక్రియను నిర్దేశించిన గడువు లోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశించారు. మంగళవారం నగ రంలోని పీఎన్‌ కాలనీ సచివాలయాన్ని నగరపాలక సంస్థ కమిషనర్‌ హెచ్‌. కూర్మారావుతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. జన గణన రికార్డులను పరిశీలిం చారు. వివరాల నమోదులో ఎటువంటి తప్పులు దొర్లరాదని, ప్రతీ ఇంటి సమా చారం సమగ్రంగా సేకరించాలని సూచిం చారు. అనంతరం సచివాలయ పరిధిలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై సమీక్షించారు. పారిశుధ్య నిర్వహణలో రాజీపడవద్దని, కాలనీలు అద్దంలా మెరవాలని కమిషనర్‌కు సూచించారు.

Updated Date - May 06 , 2026 | 12:09 AM