Share News

సీఈసీని అరెస్టు చేయాలి

ABN , Publish Date - Oct 08 , 2026 | 11:49 PM

శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద డీసీసీ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు ఆధ్వర్యంలో ఇండి కూటమి పార్టీలు ఓట్‌ చోరీకి నిరసనగా గురువారం ర్యాలీ, నిరసన ప్రదర్శన నిర్వ హించాయి. ఈమేరకు చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ను(సీఈసీ) తక్షణమే విధుల నుంచి తొల గించి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ, ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు.

  సీఈసీని అరెస్టు చేయాలి
శ్రీకాకుళంలో ధర్నా నిర్వహిస్తున్న ఇండి కూటమి నాయకులు

అరసవల్లి/శ్రీకాకుళం అర్బన్‌, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద డీసీసీ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు ఆధ్వర్యంలో ఇండి కూటమి పార్టీలు ఓట్‌ చోరీకి నిరసనగా గురువారం ర్యాలీ, నిరసన ప్రదర్శన నిర్వ హించాయి. ఈమేరకు చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ను(సీఈసీ) తక్షణమే విధుల నుంచి తొల గించి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ, ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, సీపీఎం నా యకులు డి.గోవింద్‌, తాండ్ర ప్రకాష్‌, శ్రీనివాసరావు, గోవర్థనరావు, ఆదినారాయణమూర్తి, కాంగ్రెస్‌ నాయకులు దువ్వాడ జీవితేశ్వరరావు, కేవీఎల్‌ఎస్‌ ఈశ్వరి, కిల్లి రామ్మో హనరావు, మంత్రి నర్సింహమూర్తి, వెంకటరమణ, షణ్ముఖరావు పాల్గొన్నారు.

Updated Date - Oct 08 , 2026 | 11:49 PM