చివరి రోజు నామినేషన్ల సందడి
ABN , Publish Date - Nov 18 , 2026 | 12:21 AM
గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మంగళవారం జోరుగా సాగింది. నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో ఉదయం నుంచే ఆయా కేంద్రాల వద్ద అభ్యర్థులు, మద్దతుదారుల సందడి కనిపించింది.
గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మంగళవారం జోరుగా సాగింది. నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో ఉదయం నుంచే ఆయా కేంద్రాల వద్ద అభ్యర్థులు, మద్దతుదారుల సందడి కనిపించింది.
ఇచ్ఛాపురం, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఆరు క్లస్టర్ల పరిధిలో సర్పంచ్, వార్డు సభ్యులు స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. సర్పంచ్ పదవులకు 64 మంది, వార్డు సభ్యు లకు 213 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం మూడు రోజుల్లో 138 మంది సర్పంచ్ పదవులకు, 362 మంది వార్డు మెంబర్ల పదవులకు నామినేషన్లు దాఖలు చేశారు.
కంచిలిలో 65..
కంచిలి, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): మండలంలోని 31 పంచాయతీల సర్పంచ్‌ల ఎన్నికల సందర్భంగా ఆఖరు రోజు మంగళవారం 65, వార్డు సభ్యులకు 272 నామినేషన్లు దాఖలైనట్లు ఎంపీడీవో వి.తిరుమలరావు తెలిపారు. పోలేరు, ముండలా, శాసనాం పంచాయతీలకు సంబంధించి ఒక్కో నామినేషన్ దాఖలు కావడంతో ఆ పంచాయతీలు ఏకగ్రీమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పలాస మండలంలో..
పలాస రూరల్, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా మండలంలో చివరిరోజు మంగళవారం సర్పంచ్‌లకు 28, వార్డు సభ్యులకు 161 మంది నామినేషన్లు దాఖలయ్యాయని ఇన్‌చార్జి ఎంపీ డీవో ఎస్.ఉమాపతి తెలిపారు. కాగా 18 పంచాయతీలకు 75మంది సర్పంచ్‌లకు, 289 మంది వార్డు సభ్యులుగా నామినేషన్లు వేసినట్టు పేర్కొన్నారు.
వజ్రపుకొత్తూరు మండలంలో..
వజ్రపుకొత్తూరు, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మండలంలో చివరిరోజు మంగళ వారం పోటాపోటీగా నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్ అభ్య ర్థులుగా 129, వార్డులకు 637 నామినేషన్లు వచ్చినట్టు ఎంపీ డీవో ఎన్.రమేష్ నాయుడు తెలిపారు. దీంతో మొత్తం సర్పంచ్‌లకు 297 మంది, వార్డులకు 889 మంది నామినేషన్లు దాఖలు చేశారన్నారు. కిడిసింగి, కొత్తపేట, నువ్వలరేవు, గోవిందపురం పంచాయతీలకు ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలైనట్టు స్పష్టం చేశారు.
తొలిసారి ఎక్కువ సంఖ్యలో..
సిరిమామిడిలో 14, ఉప్పలాంలో 13 నామినేషన్లు దాఖలు
సోంపేట రూరల్, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): పార్టీల తో ప్రమేయం లేకుండా ఎన్నికల్లో పోటీచేయాలన్న కుతూ హలంతో ఆయా పంచాయతీల నుంచి ఎక్కువ మంది సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు చేశారు. బ్యాలెట్ పేపర్లలో తమ పేర్లు కూడా ఉండేందుకు గాను వారంతా నామినేషన్లు వేశారు. ఏకంగా ఆయా పంచాయతీల నుంచి పది కంటే ఎక్కువ నామినేషన్లు పడడంతో అధికారులు ఆశ్చర్చానికి గురయ్యారు. పాతినవలస కేంద్రంలో సిరి మామిడి పంచాయతీకి సంబంధించి సర్పంచ్ అభ్య ర్థులుగా 14 మంది, ఆ పక్కనే ఉన్న ఉప్పలాం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులుగా 13 మంది నామినేషన్లు వేశారు. ఇంతమంది ఈ పంచాయతీల్లో నామినేషన్ వేయడం ఇదే తొలిసారి ఆయా గ్రామాల ప్రజలు చెబుతున్నారు. అయితే అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇద్దరికి మాత్రమే పార్టీ బీఫారం ఇవ్వగా మిగిలిన వారంతా ఇండిపెండెంట్లుగా నామినేషన్ వేయడం చర్చనీయాంశమైంది. సోంపేట మండల పరిధి లోని ఏడు కేంద్రాల్లో సర్పంచ్ పదవి కోసం ఇప్పటివరకు 146 మంది, 581 మంది వార్డు మెంబర్ల కోసం నామి నేషన్లు వేసినట్టు ఎంపీడీవో ఈశ్వరమ్మ తెలిపారు. ఇదిలా వుండగా రోజంతా విద్యుత్ సమస్య ఏర్పడడంతో నామి నేషన్ కేంద్రాల వద్ద అభ్యర్థులు పడిగాపులు కాశారు.